కోళ్లకు వైరస్.. సజీవంగా పూడ్చివేత
బాన్సువాడ రూరల్ (బాన్సువాడ): బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన దామరంచ సాయిలు అనే వ్యక్తికి చెందిన కోళ్లఫారంలో 6వేల బ్రాయిలర్ కోళ్లను సజీవంగానే పూడ్చిపెట్టారు. గత మూడు రోజులుగా కోళ్లు అస్వస్థతకు గురికావడంతో కోళ్ల కంపెనీ ప్రతినిధులను సంప్రదించగా వారు వైద్య పరీక్షలు జరిపి, కోళ్లకు వైరస్ సోకిందని నిర్ధారించారు. దీంతో వారి సూచనల మేరకు కోళ్లను సజీవంగా పూడ్చి వేశారు. కోళ్లకు వైరస్ సోకడంతో తాను తీవ్రంగా నష్టపోయినట్లు, సుమారు లక్షల నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నాడు.
తప్పిపోయిన వ్యక్తి.. వెతికి, పట్టుకున్న రైల్వేపోలీసులు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో తప్పిపోయిన షేక్‌బాబా అనే వ్యక్తిని, పట్టుకొని అతడి బంధువులకు అప్పగించినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. వివరాలు ఇలా.. నాందేడ్‌లోని శివాజీనగర్‌కు చెందిన షేక్ బాబా(58) ఈనెల 14న తన చిన్న కూతురు ఉంటున్న కరీంనగర్‌కు వెళ్లినట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో కరీంనగర్ నుంచి నాందేడ్‌కు వెళుతున్న క్రమంలో నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో దిగి ఇక్కడ నుంచి బయటకు వెళ్లి కనిపించకుండాపోయాడు. దీనిపై అతడి కూతురు ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా షేక్‌బాబా ముత్‌ఖేడ్ రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడే ఉండిపోయినట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి పట్టుకొని బంధువులకు అప్పగించారు.
కోళ్లకు వైరస్.. సజీవంగా పూడ్చివేత
Comments
Please login to add a commentAdd a comment