పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించుకోవాలి
భిక్కనూరు: విద్యార్థులు మారుతున్న కాలానికనుగుణంగా నూతన పరిశోధనలపై ఆసక్తిని పెంపొందిచుకోవాలని జేఎన్‌యూ ప్రొఫెసర్ రాజు చౌహాన్ అన్నారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌క్యాంపస్‌లో రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘స్పెక్ట్రోస్కోపి– దాని అనువర్తనాలు’ అనే అంశంపై నిర్వహించిన ఒక రోజు సెమినార్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పరిశోధన విద్యార్థులకు స్పెక్ట్రోస్కోపి అంశంపై అవగాహన కల్పించారు. భవిష్యత్తులో పరిశోధన రంగంలో వేలాది ఉద్యోగాలు ఉంటాయని, విద్యార్థులు ఆ వైపు మొగ్గు చూపాలన్నారు. ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్, అధ్యాపకులు సునీత, నిరంజన్‌శర్మ, శ్రీకాంత్, రసాయనశాస్త్ర విద్యార్థులు పాల్గొన్నారు.
జేఎన్‌యూ ప్రొఫెసర్ రాజు చౌహాన్
Comments
Please login to add a commentAdd a comment