జీవావరణ వ్యవస్థను కాపాడుకోవాలి
కామారెడ్డి అర్బన్: వ్యనప్రాణులతో జీవావరణ వ్యవస్థను కాపాడుకోవాలని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కె.విజయ్ కుమార్ అన్నారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల ద్వారా అడవుల్లో వ్యనప్రాణుల కదలికలు, ఉనికి గుర్తించి వాటిని లెక్కించే విధానం, సాంకేతిక పద్ధతులపై సోమవారం కళాశాల వృక్ష, అటవీ శాస్త్ర విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు రీజినల్ కో–ఆర్డినేటర్ బాపురెడ్డి, ఏవో అఖిల్‌గౌడ్‌లు రిసోర్స్ పర్సన్‌గా వివిధ అంశాలపై విద్యార్థులకు వివరించారు. పులులు, పక్షులు, పాములు, ఇతర వన్యప్రాణుల కదలికలతో పాటు వాటి సంఖ్యను సాంకేతికంగా ఎలా లెక్కించవచ్చో ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. వైస్ ప్రిన్సిపల్ కె.కిష్టయ్య, సమన్వయకర్తలు విశ్వప్రసాద్, జయప్రకాష్, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment