బైక్‌ను ఢీకొన్న బొలెరో వాహనం
పిట్లం(జుక్కల్): కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రం శివారులోని జాతీయ రహదారిపై మంగళవారం సంగారెడ్డి జిల్లాకు చెందిన దంపతులిద్దరూ బైక్‌పై వెళుతుండగా బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని అంతర్గామ గ్రామానికి చెందిన శకుంతల, సంగయ్య దంపతులు బైక్‌పై చిన్నకొడప్‌గల్ వైపు బయలుదేరారు. పిట్లం శివారులో వారి బైక్‌ను బొలెరో వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈఘటనలో శకుంతల (45) మృతి చెందగా, సంగయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని పిట్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు నమోదు చేశారు.
ప్రమాదంలో భార్య మృతి, భర్తకు గాయాలు
Comments
Please login to add a commentAdd a comment