‘నిరుపేద ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి’
భిక్కనూరు: నిరుపేద ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషిచేస్తానని భిక్కనూరు ఆర్యవైశ్యసంఘం నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన పురాం రాజమౌళి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా చల్ల లక్ష్మణ్, కోశాధికారిగా కోడిప్యాక వెంకటేశంలతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు పురాం రాజమౌళి మాట్లాడుతూ.. వైశ్య సంఘం అభివృద్ధితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతానన్నారు. అలాగే విద్యలో ప్రతిభ చూపుతున్న నిరుపేదల ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం అందజేస్తానన్నారు. ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పబ్బ నాగరాజు, శ్రీరాం చంద్రశేఖర్, గంగెళ్లి మధుసూదన్, అతిమాముల శ్రీధర్, చీకోటి నాగభూషణం, అతిమాముల రమేష్, బంక్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment