నిరంతరం పర్యవేక్షించాలి
కామారెడ్డి క్రైం: రానున్న వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. మంగళవారం ఆమె హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫ రా, రైతు భరోసా, యూరియా కొరత, రేషన్ కార్డు ల జారీ, రెసిడెన్షియల్ పాఠశాలల సందర్శన తది తర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ తాగునీటి సమస్య ఏర్పడకుండా తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. రబీ సీజన్‌కు సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువుల పై సమీక్షించి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. వేసవి లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హత గల ప్రతి రైతుకు రైతు భరోసా అందేలా చూడాలన్నారు. ప్ర జాపాలనలో రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చే యాలన్నారు. గురుకుల పాఠశాలలను జిల్లా అధికారులు సందర్శించి, సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
17 ప్రాంతాల్లో సమస్య..
జిల్లాలో 860 ఆవాస ప్రాంతాలు ఉండగా 17 చోట్ల తాగునీటి సమస్య ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అ నంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. సమస్య ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వా రా నీటిని సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. బోర్ వెల్స్‌కు అవసరమైన మర మ్మతులు చేయించాలన్నారు. రేషన్ కార్డుల వెరి ఫికేషన్‌కు సంబంధించి రోజువారీ రిపోర్టులు స మర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అ దనపు కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్‌రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, నీటిపారుదల శాఖ సీఈ రవి, మిష న్ భగీరథ ఎస్‌ఈ రాజేంద్ర కుమార్, విద్యుత్ శా ఖ ఎస్‌ఈ శ్రావణ్ కుమార్, డీఏవో తిరుమల ప్ర సాద్, ఆర్డీవో ప్రభాకర్, డీపీవో శ్రీనివాస్‌రావు, డీఎస్‌వో మల్లికార్జున్ బాబు పాల్గొన్నారు.
నీటి ఎద్దడి తలెత్తకుండా
కార్యాచరణ రూపొందించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో
సీఎస్ శాంతికుమారి
Comments
Please login to add a commentAdd a comment