యువకుడి అదృశ్యం
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని వెల్గనూర్ గ్రామానికి చెందిన సురిసాని రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు రెండు రోజుల నుంచి కనిపించకుండా పోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివకుమార్ మంగళవారం తెలిపారు. రాజశేఖర్ రెడ్డి ఎల్లారెడ్డి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 17న ఉదయం కళాశాలకు వెళ్లిన అతడు ఇంటికి తిరిగిరాలేడు. అతడి తండ్రి హన్మంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
దోమకొండలో తల్లీ కూతురు..
దోమకొండ: మండల కేంద్రానికి చెందిన నర్రాగుల కళావతి ఆమె కూతురు భవానీ అదృశ్యమైనట్లు దోమకొండ ఎస్సై స్రవంతి మంగళవారం తెలిపారు. కళావతి సోమవారం భర్త నరసింహులుతో గొడవపడింది. అనంతరం కూతురు భవానీని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంత వెతికినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో కళావతి పెద్ద కూతురు నికిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గంజాయి రవాణా
చేస్తున్న ముఠా అరెస్ట్
● 445 గ్రాముల గంజాయి స్వాధీనం
కామారెడ్డి క్రైం: గంజాయి రవాణా చేస్తున్న ఓ ముఠాను కామారెడ్డి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 445 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ రామన్ వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణాపై విశ్వసనీయ సమాచారం రావడంతో దేవునిపల్లి ఎస్సై రాజు ఆధ్వర్యంలో రామారెడ్డి బ్రిడ్జి వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ కారు, బైక్‌లపై గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని నిజామాబాద్‌కు చెందిన రాథోడ్ రవి, సయ్యద్ సాజిద్, కామారెడ్డికి చెందిన దేవుని పృఽథ్వీ, నిట్టూరి సిద్దార్థరావు, పసులోటి భానుచందర్‌గా గుర్తించారు. గంజాయిని, వాహనాలను సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
నగరంలో పోలీసు కవాతు
ఖలీల్‌వాడి: నగరంలోని రెండో పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్‌ఫోర్స్ మంగళవారం కవాతు నిర్వహించారు. రానున్న రంజాన్, హనుమాన్ జయంతి వేడుకల నేపథ్యంలో స్టేషన్ పరిధిలోని గోల్‌హనుమాన్ నుంచి కసాబ్‌గల్లీ, గాజులపేట్ తోపాటు హైమద్‌బజార్, నెహ్రూపార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, టౌన్ సీఐ శ్రీనివాసురాజు, ఎస్సై యాసీన్‌ఆరాఫత్ తదితరులు పాల్గొన్నారు.
యువకుడి అదృశ్యం
యువకుడి అదృశ్యం
Comments
Please login to add a commentAdd a comment