ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి
రాజంపేట: ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని రాజంపేట్ మండల వైద్యాధికారి విజయ మహాలక్ష్మి తెలిపారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 76 మంది మహిళలకు రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. మహిళలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని, పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. హెల్త్ సూపర్వైజర్ మంజూర్ తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట పీహెచ్‌సీలో అమ్మ ఒడి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో మంగళవారం అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించినట్లు డాక్టర్ హిమబిందు తెలిపారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీ్త్రలు, గర్భిణులు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పలువురికి రక్త పరీక్షలు చేసి నమూనాలను టి–హబ్‌కు పంపినట్లు తెలిపారు. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి
Comments
Please login to add a commentAdd a comment