కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలో బైక్‌లను చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులకు ఏడాది సాధారణ జైలు శిక్ష పడినట్లు ఎస్సై అనిల్‌రెడ్డి సోమవారం తెలిపారు. వివరాలు ఇలా.. గత ఏడాది వరంగంటి మోహన్, తెడ్డు నరేష్‌లు తమ ఇంటి ముందర నిలిపిన బైక్‌లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మోహన్ బైక్‌ను బోధన్‌కు చెందిన మాలవత్ తులసీరాం, నరేష్ బైక్‌ను బోధన్‌కు చెందిన అబ్దుల్ ఆయాజ్‌ఖాన్ చోరీ చేసినట్లు గుర్తించి, అరెస్టు చేశారు. వారిని ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చగా, విచారణ అనంతరం జడ్జి నిందితులిద్దరికి ఏడాది సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
మట్కా నిర్వాహకుడికి రెండు రోజులు..
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని ఆచన్‌పల్లికి చెందిన షేక్ గఫార్ బోధన్‌లో మట్కా నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బోధన్ కోర్టులోని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట అతడిని హాజరుపరుచగా జడ్జి రెండు రోజుల జైలుశిక్షను విధించినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు.
డ్రంకన్‌డ్రైవ్ కేసులో..
ధర్పల్లి: ధర్పల్లి శివారులోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఇటీవల పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా ఇందిరానగర్ తండాకు చెందిన సీతారాం మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో సీతారాంను మంగళవారం నిజామాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జడ్జి అతడికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
నవీపేట మండలంలో..
నవీపేట: నవీపేట్ గ్రామానికి చెందిన మహమ్మద్ నబీసాబ్, అబ్బాపూర్ (బి) గ్రామానికి చెందిన బాబు, నిర్మల్ జిల్లా కుబీర్‌కు చెందిన ఇసాల రాకేష్ ఇటీవల మద్యం తాగి వాహనాలు నడుపుతూ నవీపేట పోలీసులకు పట్టుబడ్డారు. మంగళవారం వారిని నిజామాబాద్ కోర్టులో హాజరుపర్చగా స్పెషల్ జ్యుడీ షియల్ సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ 2 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై వినయ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment