ట్రాక్టర్ బోల్తాపడి యువకుడి మృతి
బాల్కొండ: పంటభూమిని దుక్కి దున్నుటకు ఓ వ్యక్తి ట్రాక్టర్‌పై వెళుతుండగా ప్రమాదవశాత్తు వాహనం బోల్తాపడి మృతిచెందాడు. మెండోరా ఎస్సై నారాయణ తెలిపిన వివరాలు ఇలా.. కర్నేబోయిన శ్రీనివాస్(27) అనే వ్యక్తి బతుకు దెరువు కోసం మెదక్ నుంచి వెల్కటూర్‌కు కొన్నేళ్ల క్రితం వలస వచ్చాడు. గ్రామంలో ఇతరుల భూములను కౌలుపై సాగు చేసేవాడు. ఈక్రమంలో గ్రామానికి చెందిన గంగాధర్ ట్రాక్టర్‌ను మంగళవారం అతడు తీసుకుని తాను కౌలు చేస్తున్న పంట భూమిని దుక్కి దున్నుటకు బయలుదేరాడు. మార్గమధ్యలో ట్రాక్టర్ బోల్తాపడటంతో శ్రీనివాస్ ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కాలువలో పడి ఒకరు..
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రానికి చెందిన జగ్గంపల్లి సాయిలు(55) అనే వ్యక్తి ఈ నెల 14న ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగిరాలేడు. దీంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. మంగళవారం సింగితం శివారులోని నిజాంసాగర్ ప్రధాన కాలువ అతడి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. మృతుడి భార్య సాయవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment