ఆశలు ఆవిరై.. జీవాలకు మేతై..
ఎల్లారెడ్డిరూరల్: చేతికందే దశలో పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో బోర్లు ఎత్తిపోయి భూములు నెర్రెలుబారుతున్నాయి. ఎన్నో ఆశల తో సాగు చేసిన పంటపొలా లు పశువులకు మేతగా మా రుతున్నాయి. ఎల్లారెడ్డి మండలంలోని 31 గ్రామ పంచాయతీల పరిధిలో 14 వేల ఎక రాల్లో రైతులు బోరుబావుల కింద, చెరువుల కింద యాసంగి పంటలు సా గు చేస్తున్నారు. మండలం పరిధిలో 20 వేల ఎక రాల సాగు భూమి ఉన్నప్పటికీ రైతులు 50 నుంచి 60 శాతం భూము ల్లో మాత్రమే పంటలను సాగు చేశారు. అత్యధికంగా 12 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి, వెయ్యి ఎకరాల్లో జొన్న, మరో వెయ్యి ఎకరాల్లో మొక్కజొన్న, పెస ర, మినుము, వేరుశనగ, శనగ సాగు చేశారు. చెరువుల కింద ఉన్న భూము లకు సరిపడా నీరు అందుతున్నప్పటికీ, బోరు బావుల కింద పంటలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. వరితోపాటు జొన్న, మొక్కజొన్న నీరందక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పశువులకు వదిలేశా
మూడు ఎకరాల భూమిలో రెండు ఎకరాలు మాత్రమే సాగు చేశా. యాసంగిలో రెండు ఎకరాలు వరి సాగు చేస్తే బోరుబావిలో నీరు తగ్గి పోవడంతో ఎకరాకు కూడా నీరు అందడం లేదు. దీంతో పంట ఎండిపోతోంది. ఎండిన పంటను పశువులకు మేతగా వదిలేశా. – శంకర్, రైతు, శివాపూర్
జొన్న ఎండిపోతోంది
యాసంగిలో వరికి నీరు ఎక్కు వ అవసరం ఉంటుందని ఆరు తడి పంట అయిన జొన్న సాగు చేశా. ఎకరం జొన్నకు కూడా నీ రందక ఎండిపోతోంది. ప్రభు త్వం ఎండుతున్న పంటలకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి.
– కంబం సాయిలు, రైతు, శివాపూర్
నెర్రెలుబారిన భూములు..
ఎండుతున్న వరి, జొన్న పంటలు
పశువులకు మేతగా మారుతున్న వైనం
ఎత్తిపోతున్న వ్యవసాయ బోర్లు
ఆశలు ఆవిరై.. జీవాలకు మేతై..
ఆశలు ఆవిరై.. జీవాలకు మేతై..
ఆశలు ఆవిరై.. జీవాలకు మేతై..
ఆశలు ఆవిరై.. జీవాలకు మేతై..
ఆశలు ఆవిరై.. జీవాలకు మేతై..
Comments
Please login to add a commentAdd a comment