ఆటో ఢీకొని వృద్ధుడి మృతి
ఎల్లారెడ్డి: హోలీ పండుగ సందర్భంగా గురువారం ఎల్లారెడ్డి మటన్ మార్కెట్‌కు వచ్చిన ఓ వృద్ధుడిని ఆటో ఢీకొనడంతో మృతిచెందాడు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని సబ్దల్‌పూ ర్ గ్రామానికి చెందిన గడ్డం పోచయ్య (64) మటన్ కోసం ఎల్లారెడ్డికి వచ్చాడు. పట్టణంలోని గాంధీచౌ క్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుండగా అతడిని వెనక నుంచి ఆటో వచ్చి ఢీకొట్టింది. ఈఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
చెరువులో పడి వృద్ధురాలు..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ముంబోజి పేట గ్రామ శివారులోగల సింగయ్య చెరువులో ఓ వృద్ధురాలు పడి మృతిచెందినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మా దిగ కాశవ్వ(60) అనే వృద్ధురాలు నాలుగు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఎంత వెతికి నా ఆమె ఆచూకీ లభించలేదు. గురువారం భవానిపేట, ముంబోజిపేట శివారులోని సింగయ్య చెరువులో ఆమె మృతదేహం తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు కేసు న మోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment