పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలి
కామారెడ్డి టౌన్: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఏవో మన్సూర్ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యురాలు ప్రత్యూష రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధుల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. విద్యారంగంలో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలన్నారు. జిల్లా కన్వీనర్ రోహిత్, నాయకులు వెంకటేష్, అల్తాఫ్, పవన్, శశి, దత్తు, రాకేష్ తదితరులున్నారు.
తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రభాకరచారి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాజ్‌కుమార్ సూచించారు. కొన్నిరోజులుగా గోపాల్‌పేటలోని ఎస్సీకాలనీకి సరిపడా తాగునీరు సరఫరా కావడంలేదని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో గురువారం ఎస్సీ కాలనీలో తాగునీటి సరఫరాను వారు పరిశీలించారు. కాలనీకి సరిపడా నీటిని సరఫరా చేయించాలని పంచాయతీ కార్యదర్శి కిష్టయ్యకు సూచించారు. పైపులైన్ సమస్య ఉన్నచోట తవ్వించి సరిచేయించాలని వారు ఆదేశించారు.
పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలి
Comments
Please login to add a commentAdd a comment