ఏఐ ఆధారిత ఎఫ్‌ఎల్‌ఎన్ అమలు చేయాలి
కామారెడ్డి టౌన్: మౌళిక భాషా గణిత సామర్థ్యాల సాధన (ఎఫ్‌ఎల్‌ఎన్ – ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ)తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని జత చేయడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించొచ్చని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణా అన్నారు. కలెక్టర్, డీఈవో, గుణాత్మక విద్య సమన్వయకర్తలతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ప్రతి జిల్లాలో ఏఐ ఆధారిత ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. వీసీ తరువాత కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. జిల్లాలో 26 ప్రాథమిక పాఠశాలలను ఏఐ ఆధారిత ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమానికి ఎంపిక చేశామని తెలిపారు. ఆయా పాఠశాలల్లో ఏఎక్స్‌ఎల్ ల్యాబ్‌లను ఈ నెల 15న ప్రారంభించనున్నామన్నారు. ఎంపిక చేసిన ప్రతి ప్రాథమిక పాఠశాల సమీపంలోని ఉన్నత పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ ను ఉపయోగించుకొని ఒక ఉపాధ్యాయుడికి బాధ్యత అప్పగించి విద్యార్థులకు ఏఐ ఆధారిత విద్యాబోధన చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను వెంటనే సమకూర్చుకొని ఎంపిక చేసిన పాఠశాలల్లో కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. హై స్పీడ్ ఇంటర్నెట్, విద్యార్థులకు హెడ్ ఫోన్స్ సమకూర్చుకుని కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, గుణాత్మక విద్య సమన్వయకర్త వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
డీఎస్పీ కార్యాలయం తనిఖీ
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయాన్ని గురువారం ఎస్పీ రాజేశ్ చంద్ర సందర్శించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. సబ్ డివిజన్‌లోని పోలీస్ స్టేషన్‌లకు సంబంధించిన అధికారులు, సి బ్బంది వివరాలను ఏఎస్పీ చైతన్యారెడ్డిని అడి గి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ తిరుపయ్య ఉన్నారు.
పంటల్ని నష్టపర్చకుండా చర్యలు చేపట్టాలి
● డీఎఫ్‌వోకు కిసాన్ సంఘ్ నాయకుల వినతి
కామారెడ్డి అర్బన్: పంట చేలపై కోతులు, అడవి పందులు, జింకలు, నెమళ్లు పడి తీవ్ర నష్టం చేస్తున్నాయని, అటవీ సరిహద్దులకు కంచె వేసి జంతులు పంటలపైకి రాకుండా చూడాలని, పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లించాలని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు పి.విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో డీఎఫ్‌వో బి.నిఖితను కలిసి వినతి పత్రం అందజేశారు. వ్యనప్రాణులను పంటలపైకి రాకుండా జాగ్రతలు తీసుకోవాలని, అటవీ అధికారులు స్పందించకపోతే జరిగే నష్టానికి రైతులు బాధ్యులుకారని డీఎఫ్‌వోకు స్పష్టం చేశారు. బీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్‌రావు, సహ కార్యదర్శి కొమిరెడ్డి పెద్ద అంజన్న, తదితరులు పాల్గొన్నారు.
ఏఐ ఆధారిత ఎఫ్‌ఎల్‌ఎన్ అమలు చేయాలి
Comments
Please login to add a commentAdd a comment