మూడు ఇసుక ట్రాక్టర్ల సీజ్
మాచారెడ్డి: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ గురువారం తెలిపారు. పాల్వంచ మండలం బండ రామేశ్వర్‌పల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తాము పెట్రోలింగ్ నిర్వహించామన్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేసి కేసు నమోదు చేశామని, వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై వివరించారు.
బిచ్కుందలో రేషన్ షాపు..
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని రేషన్ షాపు డీలర్ అక్రమాలకు పాల్పడటంతో దుకాణాన్ని సీజ్ చేసినట్లు ఆర్‌ఐ రవింధర్ గురువారం తెలిపారు. రేషన్ బియ్యంను ప్రజలకు పంపిణీ చేయకుండా అక్రమాలకు పాల్పడ్డాడని ఫిర్యాదు రావడంతో తహసీల్దార్ ఆదేశాల మేరకు షాపులో తనిఖీ చేశామన్నారు. విచారణ చేపట్టడంతో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో షాపును సీజ్ చేసినట్లు తెలిపారు.
మూడు ఇసుక ట్రాక్టర్ల సీజ్
Comments
Please login to add a commentAdd a comment