విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడొద్దు
నస్రుల్లాబాద్(బాన్సువాడ): వేసవిలో విద్యు త్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా సి బ్బంది పని చేయాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్ అన్నారు. బీర్కూర్, నస్రుల్లాబాద్ మండల కేంద్రాల్లోని సబ్ స్టేషన్‌లను గురువారం ఆయన తనిఖీ చేశారు. సింగిల్, త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా వివరాలు తెలుసు కున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ల పని తీరును పరిశీలించారు. వినియోగదారులకు అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ఉన్నతాధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటేనే క్షేత్ర స్థాయి సిబ్బంది పని చేస్తారన్నారు. ఆయన వెంట డీఈ ఎంఆర్‌టీ నాగరాజు, బాన్సువాడ డీఈ గంగాధర్, ఏఈ ఎస్‌పీఎం దేవీదాస్, సబ్ ఇంజినీర్ రంజిత్, నరేశ్, సిబ్బంది రఘు, పీరాజీ ఉన్నారు.
జిల్లా జడ్జ్జిని కలిసిన ఎస్పీ
కామారెడ్డి టౌన్: జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రాజేశ్‌చంద్ర జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వీఆర్‌ఆర్ వరప్రసాద్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. న్యాయమూర్తికి ఎస్పీ మొక్కను అందజేశారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలపై చర్చించారు.
డీఎస్పీ శ్రీనివాసులు బదిలీ
ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు గురువారం బదిలీ అయినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. శ్రీనివాసులు హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో సూర్యాపేట సైబర్ క్రైం డీఎస్పీగా ఉన్న సుంకరి శ్రీనివాస్‌రావు రానున్నట్లు వారు తెలిపారు.
సివిల్ సర్వీసెస్ క్రికెట్ టోర్నీకి ఎంపిక
మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్ గ్రామానికి చెందిన వేల్పూరి ప్రదీప్ సివిల్ సర్వీసెస్ క్రికెట్ టోర్నమెంట్‌కు ఎంపికై నట్లు గ్రామస్తులు గురువారం తెలిపారు.ఈ నెల 17వ తేదీ నుంచి 25 వరకు ఢిల్లీలో కొనసాగనున్న క్రికెట్ టోర్నీలో ప్రదీప్ పాల్గొంటాడన్నారు. ఈ సందర్భంగా ప్రదీప్‌ను గ్రామస్తులు అభినందించారు.
316 మంది
విద్యార్థుల గైర్హాజరు
కామారెడ్డి టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 38 కేంద్రాల్లో 8423 మంది విద్యార్థులకుగాను 8107 మంది హాజరు కా గా, 316 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 7130 మంది జనరల్ విద్యార్థ్లుకుగాను 6915 మంది హాజరు కాగా, 215 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులో 1293 మందికి గాను 1192 మంది హాజరు కాగా, 101 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలను జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం పర్యవేక్షించారు.
కామారెడ్డి ఆర్టీసీ
డీఎం బదిలీ
● నూతన డీఎం కరుణశ్రీ
కామారెడ్డి టౌన్: కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిర హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్(ఏటీఏం)గా బ దిలీ అయ్యారు. 2023 ఆగస్టులో కామారెడ్డి డిపో మేనేజర్‌గా ఇందిర బాధ్యలు చేపట్టారు. పరిగి డిపో మేనేజర్‌గా పనిచేసిన క రుణశ్రీ నూతన డీఎంగా రానున్నారు. నాలు గు రోజుల్లో ఆమె విధుల్లో చేరనున్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
బాన్సువాడ: బాన్సువాడ ఆర్టీసీ బస్ డిపోలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం సరితా దేవి తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడొద్దు
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడొద్దు
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడొద్దు
Comments
Please login to add a commentAdd a comment