మూల్యాంకనం అక్కడేనా..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఏర్పడి పదేళ్లు కావొస్తున్నా టెన్త్, ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాలు ఏర్పాటు కాలేదు. దీంతో ఆయా పరీక్షా పత్రాల స్పాట్ కోసం ఉపాధ్యాయులు, అధ్యాపకులు నిజామాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. పరీక్షాపత్రాల మూల్యాంకనానికి అవసరమైన సౌకర్యాలతో ఉన్న పాఠశాలలు, కళాశాలలు స్థానికంగా అందుబాటులో ఎన్నో ఉన్నాయి. దశాబ్దాల కాలంగా ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న స్పాట్ వ్యాల్యుయేషన్‌ను అలాగే కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులు, అధ్యాపకులు స్పాట్ వ్యాల్యుయేషన్ కొనసాగినన్ని రోజులు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగాకే కేంద్రాలు ఉంటే ఇక్కడే ఉండి మూల్యాంకనం డ్యూటీ చేయొచ్చని, రాకపోకలకు ఇబ్బందులు తప్పేవని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జిల్లా ఏర్పాటైన తరువాత దాదాపు అన్ని కార్యాలయాలు కామారెడ్డిలో ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో మిగిలినవి ఒకటి అర మాత్రమే. దీనికితోడు జోన్ కూడా మారిపోయింది. ఇలాంటి సమయంలో కామారెడ్డిలో ఇంటర్, టెన్త్ స్పాట్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి
కామారెడ్డి జిల్లా ఆవిర్భవించి పదేళ్లు కావొస్తోంది. అయినప్పటికీ మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. జిల్లా అధికారులంతా ఇక్కడే ఉన్న నేపథ్యంలో, అవసరమైన సౌకర్యాలు కూడా ఉన్నందున ఇక్కడే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా కేంద్రంలో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేసే విషయంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సిన అవసర ం ఉంది. ఇక్కడే మూల్యాంకనం జరిగితే ఎన్నో వ్యయప్రయాసాలు తప్పుతాయని అంటున్నారు.
టెన్త్, ఇంటర్ స్పాట్‌కు
నిజామాబాద్ వెళ్లాల్సిందే
జిల్లా ఏర్పడి పదేళ్లు కావొస్తున్నా..
ఇక్కడే ఏర్పాటు చేయాలంటున్న
విద్యాభిమానులు
కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటిలో కలిపి పదో తరగతి పరీక్షలకు 12,579 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వాళ్లు రాసిన పత్రాలన్నింటినీ నిజామాబాద్‌కు తరలిస్తారు. అక్క డే మూల్యాంకనం జరుగుతుంది. మూ ల్యాంకనం కోసం వందలాది మంది సబ్జెక్టు టీచర్లు నిజామాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడే మూల్యాంకనం కేంద్రం ఏర్పాటు చేస్తే ఇబ్బందులు ఉండవని అంటున్నారు. అలాగే ఇంటర్‌లో ఫస్టియర్ విద్యార్థులు 8,743 మంది, సెకండియర్‌లో 9,729 మంది రాస్తున్నారు. అంటే 18,472 మంది విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను ని జామాబాద్‌కు తరలించాల్సి ఉంటుంది. ఇక్కడే మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేస్తే తరలింపు సమస్యతోపాటు అధ్యాపకులు వెళ్లివచ్చే ఇబ్బందులూ తప్పుతాయి.
Comments
Please login to add a commentAdd a comment