పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ
దోమకొండ: గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఇద్దరు వ్యక్తులు ఫోర్జరీ చేసిన ఘటన దోమకొండలో వెలుగుచూసింది. సదరు వ్యక్తులు పంచాయతీ టాక్స్ రసీదులు, ధ్రువీకరణ పత్రాలు తయారు చేసి వాటిపై కార్యదర్శి సంతకం చేశారు.
వెలుగు చూసిందిలా..
గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబ అవసరాల నిమిత్తం కామారెడ్డిలోని ప్రైవేట్ ఫైనాన్స్‌లో బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి రుణం తీసుకున్నాడు. అప్పటికే దోమకొండకు చెందిన మరొకరి వద్ద సదరు వ్యక్తి అప్పు తీసుకుని ఉన్నాడు. తనకు బాకీ ఉండి ఫైనాన్స్‌లో బంగారం తాకట్టు పెట్టిన విషయం తెలుసుకున్న అప్పు ఇచ్చిన వ్యక్తి బంగా రాన్ని తాను తీసుకొచ్చుకోవాలని ప్లాన్ చేశాడు. తనకు బాకీ ఉన్న వ్యక్తికి సంబంధించి ఇంటి వివరాలతో పంచాయతీ ధ్రువీకరణపత్రం, టాక్స్ రసీదు తయారు చేసి వాటికి ఆధార్‌కార్డు జత చేసి వాటిపై పంచాయతీ కార్యదర్శి సంతకాలు చేసి ఫైనాన్స్‌లో ఇచ్చాడు. బంగారం పెట్టి రుణం తీసుకున్న వ్యక్తి తనను పంపించాడని నమ్మించి బంగారం తీసుకు వెళ్లిపోయాడు. కొద్ది రోజుల తరువాత బంగారంపై రుణం తీసుకున్న కుటుంబసభ్యులు ఆభరణాల కోసం ఫైనాన్స్‌కు వెళ్లడంతో అసలు విషయం వెలుగుచూసింది. వెంటనే వారు పంచాయతీ కార్యాలయానికి రాగా, తన సంతకాలు ఫోర్జరీ అయ్యాయ ని తెలుసుకుని కార్యదర్శి యాదగిరి విస్తుపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
టాక్స్ రసీదులు, ధ్రువీకరణ
పత్రాలు తయారీ
దోమకొండ మండల కేంద్రంలో
వెలుగుచూసిన ఘటన
Comments
Please login to add a commentAdd a comment