ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
కామారెడ్డి టౌన్: ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గు రువారం కలెక్టరేట్ మినీ సమావేశ హాలులో పౌరసరఫరాల, వ్యవసాయ, పోలీసు, రవాణా, మార్కె టింగ్, సహకార, తదితర శాఖల అధికారులతో ధా న్యం కొనుగోళ్లపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రబీ సీజన్‌లో 2,61,110 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారని, ఇందులో 57,445 ఎకరాల్లో సన్నరకం, 2,03,665 ఎకరాల్లో దొడ్డు రకం ఉందన్నారు. కాగా 4,88,796 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 1,32,121 మెట్రిక్ టన్నుల సన్న రకం ధా న్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు 424 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, అందులో 27 కేంద్రాలు మహిళా సంఘాలు, 397 కేంద్రాలు పాక్స్ నిర్వహిస్తాయన్నారు. సన్న రకం ధాన్యం సేకరణకు 63 కేంద్రాలు, దొడ్డు రకం సేకరణకు 334 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్, ఆటోమేటిక్ ధాన్యం శుభ్ర పరిచే, తేమ కొలిచే యంత్రాలు, తూకం వేసే స్కే ల్, పాడి డ్రయ్యర్స్, గన్నీ సంచులు తదితర వా టిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధా న్యం రవాణాలో అంతరాయం ఏర్పడకుండా వాహ నాలను సమకూర్చాలని, మే చివరి వారంలో వర్షా లు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాటు చేయాలన్నారు. వాతావరణ పరిస్థితుల వివరాలను రైతులకు తెలపాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి విక్టర్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, తదితరులు పాల్గొన్నారు.
మొత్తం 424 కేంద్రాల ఏర్పాటు
సేకరణ, రవాణాలో ఇబ్బందులు రావొద్దు
అధికారులతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment