బెట్టింగ్‌లకు పాల్పడితే చర్యలు తప్పవు
రాజంపేట : ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో యువకులు, ప్రజలు బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ బెట్టింగ్, ప్రేడిక్షన్ ఛానల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని ఎస్సై పుష్పరాజ్ సూచించారు. తెలియని యాప్‌లతో జాగ్రత్తంగా ఉండాలని, డబ్బులు పోగొట్టుకోవద్దని తెలిపారు. ఎవరైనా ఐపీఎల్ బెట్టింగ్ లకు పాల్పడితే స మాచారం అందించాలన్నారు. వారిపై చట్టరీ త్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సాతెల్లిలో ఒకరు అదృశ్యం
ఎల్లారెడ్డి: మండలంలోని సాతెల్లి గ్రామంలో ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై మహేష్ శనివారం తెలిపారు. వివరాలు ఇలా.. మెదక్ జిల్లా పోచమ్మరాల్ గ్రామానికి చెందిన కుమ్మరి గోపాల్ (54) సాతెల్లిలో కొద్ది రోజులుగా పొలం కౌలుకు చేస్తున్నాడు. ఈనెల 18న అతడు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎంత వెతికిన అతడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment