సాయికుమార్, ఎస్సై
నిఖిల్ (ఫైల్)
శ్రుతి,
కానిస్టేబుల్
జిల్లాలో మూడు నెలల క్రితం సంచలనం
సృష్టించిన మూడు మరణాల కేసు త్వరలో క్లోజ్ అయ్యే అవకాశాలున్నాయి. చెరువులో ముగ్గురి మృతదేహాలు లభించిన ఈ కేసులో సాక్షులు, బాధితులు, నేరస్తులు ఎవరూ లేరు. ముగ్గురూ నీళ్లలో మునిగిపోవడంతో నీళ్లు మింగి చనిపోయినట్లు ఫోరెన్సిక్ నివేదికలు వెల్లడించాయి. ఈ నివేదికతో వీరి మరణానికి ఇతరులెవరూ కారణం కాదనేది స్పష్టమవడంతో త్వరలోనే కేసును క్లోజ్ చేసే అవకాశాలున్నాయి.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో గతేడాది డిసెంబర్ 25న ముగ్గురి మృతదేహాలు లభించిన విషయం తెలిసిందే. మృతులను భిక్కనూరు ఎస్సైగా పనిచేసిన సాయికుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన శ్రుతి, బీబీపేట గ్రామానికి చెందిన నిఖిల్ అనే యువకుడిగా గుర్తించారు. మృతుల్లో ఎస్సై, కానిస్టేబుల్ ఉండడంతో పోలీస్ ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో పరిశీలించారు. కేసును త్వరితగతిన తేల్చాలని భావించినా సరైన ఆధారాలు దొరక్కపోవడంతో సాంకేతిక అంశాలపై ఆధారపడాల్సి వచ్చింది. సంఘటన జరిగిన ప్రాంతంలో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎటూ తేల్చలేకపోయారు. మృతులు ముగ్గురు వాడిన సెల్‌ఫోన్లలోని వాట్సాప్ చాటింగ్, వాళ్ల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్‌డేటా మాత్రమే కేసులో కొంతమేర పరిశోధనకు ఉపయోగపడినట్టు తెలుస్తోంది.
ఎవరూ కారణం కాదు..
ముగ్గురి మరణానికి సంబంధించిన ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు వాళ్ల చావులకు మరెవరూ కారణం కాదని, వాళ్లకు వాళ్లుగానే చనిపోయినట్టు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే మూడు నెలలు గడిచింది. కేసు వివరాల నివేదికను రూపొందించి కోర్టుకు, అలాగే మృతుల బంధువులకు అప్పగించి కేసును క్లోజ్ చేయడమే మిగిలిందని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసును త్వరలోనే క్లోజ్ చేసే అవకాశాలున్నాయి.
హత్య, ఆత్మహత్య ఏదైనా సరే కేసులో ఎవరో ఒకరు బాధితులు ఉంటారు. సాక్ష్యాలు కూడా దొరుకుతాయి. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసుల్లో నిందితులను గుర్తించి పట్టుకోగలుగుతున్నారు. అ యితే ఈ కేసులో ముగ్గురి మధ్య జరిగిన వ్యవహారం కావడం, ముగ్గురికి ముగ్గురూ ఏకకాలంలో చనిపోవడంతో కేసులో బాధితులు, నేరస్తు లు, సాక్షులు ఎవరూ లేకుండాపోయారు. ఇందులో ఎవరో ఇద్దరు చనిపోయి ఉంటే, మూడో వ్యక్తి గురించి ఆరా తీసి కారణాలు తేల్చే అవకాశాలుండేవి. కానీ ముగ్గురూ చనిపోవడంతో స రైన ఆధారాలు దొరక్క పోవడంతో విచారణ ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. చెరువు వద్ద కు ఎందుకు వెళ్లారు? అక్కడ ఏమైనా గొడవ పడ్డారా? ఎవరు ముందు దూకి ఉంటారు? ఒకరిని కాపాడేందుకు ఒకరి వెంట మరొకరు దూ కారా? ఇద్దరు దూకడంతో తమపైకి వస్తుందని మూడో వ్యక్తి కూడా దూకి ఉంటారా? ఇలా ఎన్నో అనుమానాలు వ్యక్తమైనా వాటికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు దొరకలేదు. ముగ్గురు చనిపోయిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడం, ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ ఉన్న దాఖలాలు కూడా లే కపోవడంతో ఆధారాలు, సాక్ష్యాలు లభించే అ వకాశాలు కూడా లేవు. కాగా ఫోరెన్సిక్ నివేదికల్లో నీళ్లు మింగడం ద్వారానే మరణం సంభవించినట్లుగా వెల్లడైంది. దీంతో ముగ్గురు నీళ్ల లో మునిగిపోవడం వల్లే చనిపోయినట్టు స్పష్టమవుతోంది.
మూడు నెలల క్రితం సంచలనం
సృష్టించిన మూడు మరణాలు
మృతుల్లో ఎస్సై, కానిస్టేబుల్‌తో
సహా మరో వ్యక్తి
నీళ్లు మింగి చనిపోయినట్లు తేల్చిన
ఫోరెన్సిక్ నివేదిక
ఆధారాలు లేని కేసుగా
పరిగణిస్తున్న పోలీసులు