కరీంనగర్: పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున యువకులు వీరంగం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వ్యక్తులను కొట్టిన ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. చొప్పదండికి చెందిన అనుమాండ్ల రాజు పెద్ది రమేశ్‌తో కలిసి కరీంనగర్‌లో కూరగాయలను హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి, శుక్రవారం తెల్లవారుజామున ట్రాలీ ఆటోలో వస్తున్నాడు.
చొప్పదండి పట్టణంలోని గాంధీనగర్ దాటిన తర్వాత ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి, వాహనానికి అడ్డుగా నిల్చొని, రాజును అగ్గిపెట్టె అడిగారు. అతను లేదని చెప్పి, ముందుకు వెళ్లగా మళ్లీ అడ్డగించారు. ఈసారి మరింత మంది జమకూడి, రాజును, అడ్డువచ్చిన రమేశ్‌పై దాడి చేశారు. ట్రాలీ ఆటో అద్దం పగులగొట్టారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారని రాజు తెలిపాడు.
గాయపడిన అతను కరీంనగర్ ఆస్పత్రికి వెళ్లి, చికిత్స చేయించుకున్నాడు. శనివారం చొప్పదండి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు చొప్పదండికి చెందిన ఎండీ.ఫయాజ్, కోరుట్లకు చెందిన లింగంపల్లి మౌనేశ్, ఎలిగేడుకు చెందిన సింగిరెడ్డి రమణలపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment