
చింతచెట్టు పైనుంచి జారి పడి వ్యక్తి మృతి
వెల్గటూర్: చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన ఎండపల్లి మండలం శానబండలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కడారి లచ్చయ్య (48) చింతకాయలు తెంపేందుకు చెగ్యాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఆదివారం కూలీ పనులకు వెళ్లాడు. చెట్టు పైకి ఎక్కి కాయలు తెంపుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం స్థానికులు వెంటనే కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున మృతిచెందాడు. లచ్చయ్య భార్య భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం శాభాష్‌పల్లికి చెందిన కట్కూరి కవిత (38) చికిత్స పొందుతూ మృతిచెందింది. వారం రోజుల క్రితం శాభాష్‌పల్లి నుంచి 10 మంది మహిళలు బోయినపల్లి మండలం కొదురుపాకలోని బ్యాంక్‌కు ఆటోలో వెళ్తుండగా సంకెపల్లి వద్ద కరీంనగర్ – సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఆటోబోల్తా పడింది. ఆటోలో ఉన్న 10 మందికి, ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన కవిత హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

చింతచెట్టు పైనుంచి జారి పడి వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment