
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌కు చెందిన అనుప కనకయ్య(40) ఆర్థిక ఇబ్బందులతో సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. కనకయ్య కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల పనులు దొరక్కపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఆర్థిక సమస్యలు వెంటాడుతుండడంతో మానసికవేదనకు గురైన కనకయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో చిన్నచిన్న గొడవలు జరగడంతో ఉరివేసుకున్నట్లు గ్రామస్తులు తెలి పారు. కనకయ్య మృతితో భార్య లక్ష్మి, కూతురు శ్రీలత, కుమారుడు నవీన్ రోడ్డునపడ్డారు.
కారు, బైక్ ఢీ
● దంపతులకు గాయాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మొదటి బైపాస్‌రోడ్డుపై సోమవారం కారు, బైక్ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులకు గాయాలయ్యాయి. ఇరు వాహనాలదారులు ఘర్షణకు దిగడంతో సంఘటన స్థలంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. ఇద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నదిలో దూకిన మహిళ
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన ఓ మహిళ(35) సోమవారం గోదావరినదిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. గోదావరిఖని టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. సదరు మహిళ సా యంత్రం గోదావరి వంతెన వద్దకు చేరుకొంది. హఠాత్తుగా నదిలో దూకింది. లోనీరు లేకపోవడంతో ఇసుకలో పడితీవ్ర గాయాలపాలైంది. టూటౌ న్ బ్లూకోల్ట్స్ సిబ్బంది బాధితురాలిని వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సిం ఉందని పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
మానకొండూర్: రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థి సోమవారం మృతిచెందాడు. సీఐ లక్ష్మీనారాయణ వివరాలు.. మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన రామంచ కిషన్‌కు కుమారుడు మణివర్దన్, కుమార్తె వైష్టవి సంతానం. మణివర్దన్ (18) హన్మకొండలోని కాకతీయ యూనివర్శిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని తన స్నేహితుడి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి తిరిగి జమ్మికుంట– మానకొండూర్ రహదారి వెంట వస్తుండగా, వెనకనుంచి ద్విచక్రవాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ఈప్రమాదంలో మణివర్దన్‌కు తీవ్రగాయాలు కాగా కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
రాజన్న భక్తుడికి ఫిట్స్
వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు ఫిట్స్ వచ్చి ఆలయ ప్రాంగణంలో పడిపోయాడు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలానికి చెందిన లెంకల తిరుపతి కుటుంబ సభ్యులతో సోమవారం రాజన్న దర్శనానికి వచ్చాడు. ఆలయ ప్రాంగణంలో ఫిట్స్‌తో పడిపోగా.. అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు, కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment