
కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందో..
కరీంనగర్‌టౌన్: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం కరీంనగర్‌లోని కొండా సత్యలక్ష్మీగార్డెన్‌లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని బీజేపీ మండలాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్‌రెడ్డి ఒక్క తప్పు చేయాలని అంటే ఐఏఎస్‌లు మూడు తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. సీఎంగా ఉంటూ అవినీతిని, తప్పులను నిరోధించాల్సింది పోయి తప్పులు చేయాలని చెప్పడమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రే అవినీతి, తప్పులు జరుగుతున్నాయని ఒప్పుకున్నట్లయిందన్నారు. రాష్ట్రంలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందన్నారు. కొందరు మంత్రులు సొంత దుకాణాలు ఓపెన్ చేసి ప్రతి పనికీ 15 శాతం చొప్పున కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుస్థానాల్లో బీజేపీ గెలుస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకక బయటనుంచి అద్దెకు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. కులగణన పేరుతో కాంగ్రెస్ పార్టీ కొరివితో తలగొక్కోంటోందన్నారు. బీజేపీ శ్రేణులు కష్టపడి అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీలు రఘునందన్‌రావు, జి.నగేశ్, ఎమ్మెల్యేలు కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్‌ఎస్.ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, బొడిగె శోభ, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్లు సునీల్‌రావు, డి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఐఏఎస్‌లను తప్పు చేయాలని ముఖ్యమంత్రే అంటారా?
మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవబోతోంది
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment