
కోల్‌మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుభాని
గోదావరిఖని: కోల్‌మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుభానిని నియమిస్తూ సింగరేణి సీఎండీ ఎన్.బలరాం సోమవా రం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు కో ఆర్డినేషన్ జీఎంగా పనిచేస్తున్న సుభానికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆరుగురు జీఎంల బదిలీ
గోదావరిఖని: సింగరేణి సంస్థలోని ఆరుగురు జీఎంలను బదిలీ చేస్తూ యాజమాన్యం సోమవారం ఆదేశాలు జారీచేసింది. శ్రీరాంపూర్ జీఎం ఎల్‌వీ సూర్యనారాయణ ఆపరేషన్ డైరెక్టర్‌గా, ఏపీఏ జీఎం వెంకటేశ్వర్లు ప్రాజెక్టు అండ్‌ప్లానింగ్ జీఎంగా నియామకం అయ్యారు. రెండు జీఎం పోస్టులు ఖాళీ కావడంతో వారిస్థానంలో కొత్తవారిని జీఎంలుగా నియమించారు. శ్రీరాంపూర్ జీఎంగా బెల్లంపల్లి జీఎంగా పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్‌ను నియమించారు. ఏపీఏ జీఎంగా ఆర్జీ–3లో అడిషనల్‌జీఎంగా పనిచేస్తున్న కొలిపాక వెంకటేశ్వర్‌రావును నియమించారు. సీఎంసీ కార్పొరేట్ జీఎంగా పనిచేస్తున్న ఎం.విజయభాస్కర్‌రెడ్డిని బెల్లంపల్లి జీఎంగా, ఆర్ అండ్ డీ కార్పొరేట్‌లో పనిచేస్తున్న మేకల కనకయ్యను కొత్తగూడెం క్వాలిటీ జీఎంగా, మందమర్రి కేకే గ్రూప్ ఏవోగా పనిచేస్తున్న వి.రామదాసును కార్పొరేట్ బిజినెస్ డెవలప్‌మెంట్ జీఎంగా, ఓసీపీ–3 అధికారిగా పనిచేస్తున్న ఎస్.మధుసూదన్‌ను కార్పొరేట్ సీఎంసీ జీఎంగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి 45 రోజుల జైలు
జగిత్యాలజోన్: బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి 45 రోజుల జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ సో మవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్ర కారం.. జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన బాలికపై అలిశెట్టి బాలకృష్ణ అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం బాలకృష్ణకు 45 రోజుల జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment