వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం
తిమ్మాపూర్:మండలంలోని ఎల్‌ఎండీకాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ 46వ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవా రం శ్రీ ఆండాళ్ పద్మావతి సహిత వేంకటేశ్వరస్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు గోవర్దన వెంకటాచార్యులు, గోవర్ధన శ్రీకాంత్‌చార్యులు వేడుకను నిర్వహించారు. మృత్యుంజయ మహా దేవాలయం (శివాలయం) నుంచి ఆలయ కమిటీ చైర్మన్ చల్లా మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంఘం లక్ష్మణ్‌రావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై కల్యాణాన్ని తిలకించారు. ఆలయ కమిటీ చైర్మన్, టీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధా న కార్యదర్శి ఒంటెల రవీందర్‌రెడ్డి, కోశాధికారి పోలు కిషన్, దారం శ్రీనివాస్‌రెడ్డి, గంగారపు రమేశ్, రాగి శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, బట్టు కరుణాకర్, డీటీసీ పురుషోత్తం పాల్గొన్నారు.
వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment