బావిలో దూకి విద్యార్థి ఆత్మహత్య
తిమ్మాపూర్: ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్‌ఎండీ పోలీసులు తెలిపిన వివరాలు... మండలంలోని మన్నెంపల్లికి చెందిన సిరికొండ నిఖిల్ రావు(22) హైదరాబాదులో అగ్రికల్చర్ బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురై సోమవారం ఉదయం 11:40 గంటలకు గ్రామానికి చెందిన జాప రవీందర్‌రెడ్డి వ్యవసాయ బావిలో దూకాడు. మృతుడి తండ్రి తిరుపతిరావు ఫిర్యాదుతో కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు
20మంది సింగరేణి అధికారుల బదిలీ
గోదావరిఖని: సింగరేణి వ్యాప్తంగా 20మంది మైనింగ్‌అధికారులను బదిలీ చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన వారిలో.. రామగుండం రీజియన్‌కు చెందిన అధికారులు నలుగురు ఉన్నారు. వీరిలో మందమర్రి కేకే–5లో పనిచేస్తున్న ప్రవీణ్ వి ఫ్యాటింగ్ అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు ప్రాజెక్టు అధికారిగా బదిలీ చేశారు. జీడీకే–1 గనిలో డీవైజీఎంగా పనిచేస్తున్న డి.రమేశ్‌ను మణుగూరు ఏరియా పీకే ఓసీ మేనేజర్‌గా, శ్రీరాంపూర్ డివిజన్ ఎస్‌ఆర్‌పీ ఓసీపీ–2లో కాలరీ మేనేజర్‌గా పనిచేస్తున్న బ్రహ్మాజీని ఆర్జీ–1 క్వాలిటీ మేనేజ్‌మెంట్ అధికారిగా బదిలీ చేశారు. మందమర్రి ఏరియా ఆర్కేపీ ఓసీ కాలరీ మేనేజర్‌గా పనిచేస్తున్న సుధీర్‌జయవంత్‌రావును జీడీకే–1గని మేనేజర్‌గా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment