42 శాతం రిజర్వేషన్లతో బీసీలు ఎదగాలి
వేములవాడ: 42 శాతం రిజర్వేషన్లతో బీసీలు ఐక్యంగా ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంఽధీ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసిన సర్వే తర్వాత జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో సీట్లను బలహీనవర్గాలకు కేటాయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. వేములవాడ రాజన్నను కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పట్టణంలోని మహాలక్ష్మివీధిలో గౌడసంఘం నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పేద విద్యార్థులు చదువుకునేందుకు 55 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేయడం మంచి నిర్ణయమన్నారు.
కాంగ్రెస్‌లో బీసీలకు పెద్దపీట
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికే నిదర్శనం
మంత్రి పొన్నం ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment