కలెక్టర్‌ను కలిసిన సీపీ
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన గౌస్ ఆలం సోమవారం కలెక్టర్ పమేలా సత్పతిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో పూల మొక్కను అందజేశారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు అధికారులు చర్చించారు.
పేదలకు అందుబాటులో జన ఔషధి
● జాతీయ ఉత్తమ పీఏసీఎస్ అవార్డు గ్రహీత మల్లారెడ్డి
చొప్పదండి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జాతీయ ఉత్తమ పీఏసీఎస్ హైట్రిక్ అవార్డు గ్రహీత వెల్మ మల్లారెడ్డి అన్నారు. చొప్పదండి పీఏసీఎస్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ రోడ్డులో జన ఔషది కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో తొలి జన ఔషధి కేంద్రాన్ని చొప్పదండిలో ప్రారంభించామని, ఈ మందుల దుకాణంలో 70 శాతం తక్కువ ధరలకు మందులు లభిస్తాయని తెలిపారు. చొప్పదండితో పాటు, పరిసర మండలాల ప్రజలు ఈ జన ఔషది కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ కేంద్రం నడుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ ముద్దం మహేశ్ గౌడ్, సీఈవో కళ్లెం తిరుపతిరెడ్డి, ఆర్నకొండ పీఏసీఎస్ చైర్మన్ మినుపాల తిరుపతిరావు, నాయకులు చిలుక రవిందర్, సింగిరెడ్డి కృష్ణారెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, గుంటి మల్లయ్య, క్యాతం పురుషోత్తం, ఇప్పనపల్లి సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.
సమ్మెకు రెడీగా ఉండాలి
విద్యానగర్(కరీంనగర్): కార్మికులు సమ్మెకు రెడీగా ఉండాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు పిలుపు నిచ్చారు. కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సోమవారం జరిగిన రీజియన్ సభలో పలువురు నాయకులు మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమాన జీతభత్యాలు, పీఆర్సీ ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం వెంటనే చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఇ.వెంకన్న, వైస్ చైర్మన్ ఎం.థామస్‌రెడ్డి, కన్వీనర్ సుద్దాల సురేశ్, కరీంనగర్ జిల్లా జేఏసీ చైర్మన్ ఎంపీ రెడ్డి, వైస్ చైర్మన్ కొమ్మ కొమురయ్య, కన్వీనర్, జె.పుల్లయ్య, కోకన్వీనర్ దొంద రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
సెంకడియర్‌లో 322 మంది గైర్హాజరు
కరీంనగర్: ఇంటర్మీడియెట్ సెంకడియర్ పరీక్షలో సోమవారం 322 మంది గైర్హాజరు అయ్యారని డీఐఈవో జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జనరల్, ఒకేషనల్ విభాగంలో 15,381 మందికి గాను 5,059 మంది హాజరైనట్లు డీఐఈవో వివరించారు.
క్వింటాల్ పత్తి రూ.7,150
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ పత్తి ధర రూ.7,150 పలికింది. క్రయవిక్రయాలను ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజాలు పర్యవేక్షించారు.
కలెక్టర్‌ను కలిసిన సీపీ
కలెక్టర్‌ను కలిసిన సీపీ
కలెక్టర్‌ను కలిసిన సీపీ
Comments
Please login to add a commentAdd a comment