మాటతోనే తెలుగుభాష వైభవం
కరీంనగర్ సిటీ: ప్రజలు, కవులు నిత్యం తెలుగు మాట్లాడితే మాతృభాష వైభవం కలకాలం వర్థిల్లుతుందని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్ తెలిపారు. కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాలలో తెలుగు విభాగం, నెల్లూర్ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంయుక్త నిర్వహణలో రెండు రోజుల జాతీయ సదస్సును బుధవారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వీసీ ఉమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. అందరం తెలుగులో మాట్లాడితేనే తెలుగుభాష కలకాలం వర్థిల్లుతుందన్నారు. ప్రిన్సిపాల్ కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ.. తొలి తెలుగు కంద పద్యాన్ని గుండెల మీద మోస్తున్న కరీంనగర్ గడ్డమీద ఈ సదస్సు నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. మాడభూషి సంపత్‌కుమార్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నలిమెల భాస్కర్, గండ్ర లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
కరీంనగర్ సిటీ: ప్రస్తుతం జరుగుతున్న డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులు అపరిచి త కాల్స్‌ను నమ్మవద్దని సైబర్‌క్రైం పోలీసులు సూచించారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నగరంలోని ఉమెన్స్ కాలేజీలో డిజిటల్ అరెస్ట్ మోసాలపై బుధవారం అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.వరలక్ష్మి మాట్లాడుతూ.. డిజిటల్ మోసాల ఉచ్చులో ప్రజలు ఎక్కువగా చిక్కుకుంటున్నారని తెలిపారు. అపరిచితులు చేసే కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సైబర్ క్రైం ఎస్సై జ్యోత్స్న, సిబ్బంది పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్ కో–ఆర్డినేటర్ బి.రజినీదేవీ, ఎం.కల్పన పాల్గొన్నారు.
కీలక సంస్థల్లో నిరంతర విద్యుత్ సరఫరా
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్‌లోని కీలకమైన సంస్థల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటన్నట్లు టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు తెలిపారు. కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి, మాతా శిశు కేంద్రం, కలెక్టరేట్, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా పొజిషన్, అంతరాయం లేని విద్యుత్ అందించడానికి అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. ఆస్పత్రిలో ఆటో జనరేటర్ వర్కింగ్ కండిషన్‌ను పరిశీలించి, వినియోగంలోకి తేవాలని సూచించారు. జిల్లాలోని ఆసుపత్రులు, మంచినీటి పథకాలు, మిషన్ భగీరథ, ఫిల్టర్ బెడ్, ఐటీపార్క్ ఫీడర్లను తనిఖీ చేసి, అంతరాయం లేని విద్యుత్ అందించాలని ఆదేశించారు. డీఈ జంపాల రాజం, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఏడీఈ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
నిధులు విడుదల చేయాలి
శంకరపట్నం: విదేశీ విద్యను అభ్యసిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ ఓవర్సీస్ నిధులు విడుదల చేయాలని ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు డిమాండ్ చేశారు. కేశవపట్నంలో బుధవారం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ గిరిజన విద్యార్థులను వారి తల్లిదండ్రులు అప్పుచేసి విదేశీవిద్య అభ్యసించడానికి విదేశాలకు పంపించారని, సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రస్తుత సీఎం నిర్వీర్యం చేస్తున్నాడని ఆరోపించారు. కోనేటి రాజు, రాజలింగం, సమ్మయ్య, కుమారస్వామి, తిరుపతి, మల్లేశం పాల్గొన్నారు.
మాటతోనే తెలుగుభాష వైభవం
మాటతోనే తెలుగుభాష వైభవం
మాటతోనే తెలుగుభాష వైభవం
Comments
Please login to add a commentAdd a comment