ఇంటర్ పరీక్షలు ప్రారంభం
కరీంనగర్: ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 58 కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు గంట ముందుగానే చేరుకున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. తొలిరోజు ఫస్టియర్ జనరల్ విభాగంలో 17,011మందికి గాను 398మంది గైర్హాజరయ్యారు. 16,613 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఒకేషనల్ విభాగంలో 1,646 మందికి గాను 151మంది గైర్హాజరు అయ్యారు. 1,495మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మొత్తంగా 18,657మందికి 549మంది గైర్హాజరు అయ్యారు. 18,108మంది పరీక్ష రాశారని డీఐఈవో జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. పరీక్షలను 58మంది డిపార్ట్‌మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, మూడు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించినట్లు వెల్లడించారు.
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment