● బల్దియా కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థలో ఈఈ యాదగిరి, కాంట్రాక్టర్ నడుమ నెలకొన్న వివాదం కీలక మలుపు తిరిగింది. తనపై కాంట్రాక్టర్ నారాయణ దౌర్జన్యం చేశాడని ఈఈ యాదగిరి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో గత నెల 19న ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీనికి కౌంటర్‌గా ఈఈ యాదగిరి కాంట్రాక్టర్‌ని వేధిస్తున్నాడని, ఆయనపై చర్య తీసుకోవాలంటూ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం బాధ్యులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అయితే యాదగిరిపై ఆరోపణలు సరికాదని కొంతమంది అసోసియేషన్‌ను తప్పుగా వాడుతున్నారంటూ మరికొంతమంది కాంట్రాక్టర్లు తాజాగా ఎదురు తిరగడం హాట్‌టాపిక్‌గా మారింది. గతనెల 19వ తేదీన కాంట్రాక్టర్ నారాయణ తనపై దౌర్జన్యం చేశాడంటూ ఈఈ యాదగిరి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈఈ యాదగిరి తమను వేధిస్తున్నాడని, కులంపేరుతో బెదిరిస్తున్నాడంటూ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కానీ అసోసియేషన్‌లోని కొందరు కాంట్రాక్టర్లు ఈఈకి సంఘీభావం ప్రకటించడంతో ఈ వ్యవహారం రసకందాయంలో పడింది.
కొంతమంది వల్లే అప్రతిష్ట
కొంతమంది కాంట్రాక్టర్ల తీరువల్ల అసోసియేషన్ అప్రతిష్ట పాలవుతుందని పలువురు కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్‌కు కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం పేరిట వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్టర్, ఈఈకి మధ్య జరిగిన గొడవకు అసోసియేషన్‌కు సంబంధం లేదన్నా రు. కొంతమంది కాంట్రాక్టర్లు అధికారులను బ్లా క్ మెయిల్ చేస్తున్నారని, వినకపోతే ఏసీబీకి పట్టిస్తామంటున్నారని తెలిపారు. ఈ గొడవ గతనెల 19న జరిగితే వారం రోజుల తర్వాత అసోసియేషన్ తరఫున ఫిర్యాదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గొడవకు సంబంధించి ఈఈ యాదగిరిపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తమకు ఏ అధికారితోనూ గొడవలు లేవని వారు తెలిపారు. కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం నాయకులు ప్రశాంత్, సుధాకర్, మల్లారెడ్డి, రవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment