‘వేస్ట్ టు వండర్ పార్క్’ అభివృద్ధికి కార్యాచరణ
● నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్
కరీంనగర్ కార్పొరేషన్: ఢిల్లీ, హైదరాబాద్ మహానగరాల తరహాలో నగరంలోనూ ‘వేస్ట్ టు వండర్ పార్క్’ను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. నగరంలోని అలకాపురి పార్క్, శ్రీనగర్ కాలనీ పార్క్‌ను బుధవారం సందర్శించారు. పాడైపోయిన వస్తువులు వ్యర్థాలతో పార్కును అభివృద్ధి పరిచేందుకు స్థల పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఎంపిక చేసిన స్థలంలో వేస్ట్ టు వండర్ పార్కును అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ పార్కులో వ్యర్థాలతో వివిధ రకాల పక్షులు, జంతువుల ఆకృతులను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. బొమ్మకల్ ఫ్లైఓవర్‌కు ఆకర్షణీయమైన బొమ్మలతో రంగులు వేయాలని అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ డీఈలు వెంకటేశ్వర్లు, ఆయుబ్ ఖాన్, పర్యావరణ ఇంజినీర్ స్వామి, ఏఈ అబ్దుల్ గఫూర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment