● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్
కరీంనగర్ కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షన్ పోటీల్లో ఈ ఏడాది నగరపాలకసంస్థ మెరుగైన ర్యాంక్ సాధించేలా చూడాలని కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ అధికా రులకు సూచించారు. గురువారం నగరంలోని హౌసింగ్‌బోర్డుకాలనీలో రిసోర్స్ పార్క్‌ను సందర్శించారు. కొత్తగా డ్రైరిసోర్స్ కలెక్షన్ సెంటర్, వర్మీకంపోస్ట్ తయారీ పిట్స్ నిర్మాణాల కోసం స్థలపరిశీలన చేశారు. నూతన డీఆర్‌సీ సెంటర్, వర్మీ కంపోస్టు పిట్స్ నిర్మాణాలతో చెత్త నుంచి ఎరువు తయారుచేయడంతో పాటు, పొడిచెత్తను వేరుచేయడం జరుగుతుందన్నారు. పొడిచెత్తను మూడు రకాలుగా వేరుచేయడానికి యంత్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతీరోజు రిసోర్స్ పార్క్‌కు వచ్చే తడిచెత్త, పొడిచెత్తను ఇక్కడే వేరుచేసి డంప్‌యార్డ్‌కు చెత్తను తగ్గిస్తామన్నారు. ఇప్పటికే ఉన్న వర్మీకంపోస్టు పిట్స్‌తో పాటు కొత్తగా పిట్స్‌తో పూర్తిస్థాయిలో వర్మీకంపోస్ట్‌ను తయారు చేస్తామన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. తడి, పొడి చెత్త, ఇల్లు, పరిసరాల్లో చెత్తవేస్తే వచ్చే నష్టాలు, తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈ సతీశ్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ స్వామి, ఐటీసీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment