మంథని: మంథని మండలం బిట్టుపల్లి గ్రామ మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్‌కు చెందిన ఒకరు మృతి చెందగా.. హైదరాబాద్‌కు చెందిన మరొకరు గాయపడ్డారు. ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన ఆరుగురు యువకులు ముత్తారం మండలం ఖమ్మంపల్లిలో తమ మిత్రుడి సోదరి వివాహం కోసం వచ్చారు. గురువారం వివాహం అనంతరం ఫంక్షన్ హాల్ నుంచి మూడు ద్విచక్రవాహనాలపై తిరిగి మిత్రుడి ఇంటికి వెళ్లున్నారు. ఈ క్రమంలో మార్గంమధ్యలో మూలమలుపు వద్ద ఓ బైక్ చెట్టుకు ఢీకొనడంతో గుండపాక ఉదయ్(24)అక్కడిక్కడే మృతిచెందాడు. బైక్ ఉన్న మరో యువకుడు పుట్టని గణేశ్‌కు గాయాలయ్యాయి. మృతుడు ఉదయ్ మహబూబాబాద్‌కు చెందిన వ్యక్తికాగా.. హైదరాబాద్‌లో ఉంటున్నట్లు ఎస్సై తెలిపారు. గాయపడిన గణేశ్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment