బైక్, వాహనాలను ఢీకొట్టి కారు బోల్తా
శంకరపట్నం(మానకొండూర్): శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో గురువారం మోటార్ సైకిల్, రెండు వాహనాలను ఢీకొట్టి కారు బోల్తా పడింది. హన్మకొండకు చెందిన గుడిపాటి భూపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కరీంనగర్‌లో బంధువుల వివాహానికి హాజరై కరీంనగర్ నుంచి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో వంకాయగూడెం గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌ను ఢీకొట్టి రెండు ప్యాసింజర్ వాహనాలను ఢీకొంది. మానకొండూర్ మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన రమేశ్ ఆటో నుజ్జునుజ్జు కాగా.. రోడ్డుపై పడ్డాడు. శంషాబాద్ గ్రామానికి చెందిన సతీశ్ మోటార్ సైకిల్‌పై నుంచి ఎగిరిపడ్డాడు. తాడికల్ గ్రామానికి చెందిన రాజమల్లు టాటా ఏసీలో అంబాల్‌పూర్, వంకాయగూడెం పాఠశాలకు చెందిన ముగ్గురు టీచర్లను కరీంనగర్ తీసుకెళ్తుండగా కారు ఢీకొంది. కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో కారు నడుపుతున్న భూపాల్‌రెడ్డి, కారులో కూర్చున్న శ్రీనివాస్‌రెడ్డి, రమాదేవి, మానస, సుజాతలకు స్వల్ప గాయాలయ్యాయి. రెండేళ్ల బాలుడు క్షేమంగా ఉన్నా.. ప్రమాదం జరిగిన వెంటనే రోదించాడు. కారులో ఇరుక్కున్నవారిని ప్రయాణికులు, స్థానికులు బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన రమేశ్, సతీశ్‌ను 108 వాహనంలో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మరో 108 వాహనంలో రాజమల్లును హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కేశవపట్నం పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కారు నడుపుతున్న భూపాల్‌రెడ్డి నిద్రలోకి జారినట్లు తెలిసింది.
పలువురికి తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment