12,508 కేసులు పరిష్కారం
సిరిసిల్లకల్చరల్: సిరిసిల్ల కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో రికార్డు నెలకొంది. ఒకే రోజు అత్యధికంగా 12,508 కేసులు పరిష్కారమయ్యాయి. కక్షిదారులు పరస్పర చర్చల ద్వారా రాజీకొచ్చారు. ఆయా కేసుల్లో రూ.1,11,66, 562 విలువైన లావాదేవీలు పరిష్కారానికి నోచుకున్నాయి. ట్రాఫిక్, బ్యాంకింగ్, బీఎస్‌ఎన్‌ఎల్ సంబంధించిన కేసులు 9,034 కావడం గమనార్హం. రాజీకొచ్చిన కక్షిదారులను జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాధికా జైస్వాల్ అభినందించారు. న్యాయమూర్తులు ప్రవీణ్, లక్ష్మణాచారి, సృజన, మేఘన, అదనపు ఎస్పీ చంద్రయ్య, అడ్వకేట్లు భగవాన్, అన్వార్ అలీ, ఆడెపు వేణు. ఆంజనేయులు, వి.మౌళి, సుష్మ, అభిలాశఖ, అరుణ, చింతోజు భాస్కర్ పాల్గొన్నారు.
దంపతులను కలిపిన
లోక్ అదాలత్
వేములవాడ: పదేళ్ల క్రితం పెళ్లితో ఒక్కటైన దంపతులు ఇద్దరు పిల్లలు పుట్టాక, గొడవలు పెరిగి 2021లో ఠాణా మెట్లెక్కారు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామానికి చెందిన వినోద, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన వెంకటికి పదేళ్ల క్రితం వివాహమైంది. 2021లో అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని తన భర్తపై వినోద ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి కేసు నడుస్తూనే ఉంది. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి కిరణ్మయి ఎదుట తాము రాజీకొచ్చామని, కలిసి ఉంటామని ఒప్పుకున్నారు. దీంతో వారిపై ఉన్న కేసును కొట్టేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. అనంతరం వారిని అభినందించారు.
సిరిసిల్ల లోక్ అదాలత్‌లో రికార్డు
వేములవాడలో ఒక్కటైన దంపతులు
Comments
Please login to add a commentAdd a comment