వ్యక్తి దారుణ హత్య
కరీంనగర్‌క్రైం: పట్టణంలోని పోచమ్మవాడలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్‌టౌన్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...నగరంలోని లక్ష్మీనగర్‌లో నివాసముంటున్న బాలసాని రాము (41), పోచమ్మవాడలో నివాసముంటున్న సంతపురి సంతోష్ స్నేహితులు. రాము లక్ష్మీనగర్‌లో కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. సంతోష్ గతంలో నీటిపారుదల శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి సస్పెన్షన్‌కు గురయ్యాడు. శనివారం రాత్రి సంతోష్ రాముకు ఫోన్ చేశాడు. ఇద్దరూ సంతోష్ ఇంటికి వెళ్లారు. రాము భార్య లతశ్రీ రెండ్రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లగా ఆదివారం నుంచి రాముకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. సోమవారం ఇంటికి వచ్చి చూసేసరికి రాము లేకపోవడంతో పోలీసులకు వివరాలు తెలిపింది. ఫోన్ కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపట్టారు. పోచమ్మవాడలోని సంతోష్ ఉండే అద్దె ఇంటికి పోలీసులు వెళ్లిచూడగా రాము రక్తపు మడుగులో మృతిచెంది ఉన్నాడు. రాము బైక్ పైనే సంతోష్ వెళ్లినట్లుగా సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లత శ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్ సీఐ బిల్ల కోటేశ్వర్ తెలిపారు. ఈ హత్య ఒక్కరే చేశారా.. లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పలువురిని వన్‌టౌన్ పోలీసులు విచారించినట్లు తెలిసింది.
వీధి కుక్క దాడిలో చిన్నారికి గాయాలు
శంకరపట్నం: తాడికల్ గ్రామంలో సోమవారం వీధి కుక్క దాడి లో మూడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. తాడికల్ సబ్ స్టేషన్‌లో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా పని చేస్తున్న కుమార్ విధులకు హాజరయ్యేందుకు సిద్ధమవుతుండగా.. ఆయన కుమారుడు క్రుత్విక్(3) ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. వీధి కుక్క దాడి చేసి ముఖంపై గాయపర్చడంతో బాలుడు కేకలు వేశాడు. తల్లిదండ్రులతోపాటు చుట్టుపక్కలవారు కుక్కను తరిమి కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు.
వ్యక్తి దారుణ హత్య
Comments
Please login to add a commentAdd a comment