పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని పాతబజార్‌లో వ్యాపారి దేవరకొండ కరుణాకర్‌కు చెందిన దుకాణంలో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఈ ఘటనలో మొదటి అంతస్తులోని దుకాణం తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు.. 100గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.40వేల నగదు ఎత్తుకెళ్లారని యజమాని కరుణాకర్ తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై మల్లేశ్ ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. భవనానికి మరమ్మతులు చేపట్టడంతో దుకాణాన్ని ఫస్ట్‌ఫ్లోర్‌లోకి మార్చారని, దొంగలు షటర్‌ను పగులగొట్టి లోనికి చొరబడి ఆభరణాలు ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.