● రుణాల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయండి ● డీఆర్డీఏ సమీక్షలో కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్/కరీంనగర్‌టౌన్/రామడుగు: జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శుక్రవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సమీక్ష సమావేశం నగరంలోని స్వశక్తి భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను 49 నుంచి 150కి పెంచుతున్నామని వి వరించారు. ఏపీఎంలు, సెంటర్ ఇన్‌చార్జీలు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. తేమ యంత్రాలు సమకూర్చాలని పేర్కొన్నారు. ధాన్యం రకాలు, నిర్దిష్ట ప్రమాణాలు తెలియజేసే బ్యానర్‌ని కొనుగోలు కేంద్రాల వద్ద ప్రదర్శించాలని సూచించారు. అర్హత ఉన్న స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందజేయాలన్నారు. రానున్న విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ సిద్ధం చేసే అంశాన్ని చర్చించారు. డీఆర్డీవో శ్రీధర్, అడిషనల్ డీఆర్డీవో సునీత, డీపీఎంలు ప్రవీణ్, తిరుపతి, సీ్త్రనిధి అధికారి రవికుమార్ పాల్గొన్నారు.
పకడ్బందీగా యూడీఐడీ కార్డుల ప్రక్రియ
దివ్యాంగులకు జారీ చేయనున్న యూడీఐడీ కార్డుల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని యూడీఐడీ కార్డుల వైద్య పరీక్షల విభాగాన్ని శుక్రవారం సందర్శించారు. వైద్య పరీక్షల కోసం వచ్చే దివ్యాంగులకు వసతులు కల్పించాలన్నారు. అవసరమైన మిషనరీ టెక్నీషియన్ల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఇదివరకే సదరం సర్టిఫికెట్ ఉన్న వాళ్లు యూడీఐడీ కార్డుకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. సర్టిఫికెట్ జారీ కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్‌ఎంవో నవీన, డీఆర్డీవో శ్రీధర్ పాల్గొన్నారు.
మహిళలకు 50రకాల ఉచిత వైద్య పరీక్షలు
జిల్లావ్యాప్తంగా ఆర్యోగ మహిళ కార్యక్రమంలో భాగంగా ప్రతీ మహిళకు ఉచితంగా 50రకాల వైద్య పరీక్షలను నిర్వహించడం జరుగుతోందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. రామడుగు మండలం కొక్కెరకుంట అంగన్వాడీకేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సభను నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు తప్పకుండా శుక్రవారం సభకు హాజరుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సబితా, డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఎంపీడీవో రాజేశ్వరి, ప్రత్యేకాధికారి అనిల్ ప్రకాశ్ పాల్గొన్నారు.