
పంచ్ కొడితే పతకమే
● అంతర్జాతీయ కరాటే పోటీల్లో గ్రామీణ విద్యార్థిని ప్రతిభ
● మలేషియా ఇంటర్నేషియల్ పోటీలకు హాసిని ఎంపిక
● వరల్డ్ చాంపియన్‌లో దేశానికి మెడల్ తేవడమే లక్ష్యం
ముత్తారం(మంథని): ఆమె గ్రామీణ విద్యార్థిని.. ఆర్థిక స మస్యలున్నా కరాటే పోటీల్లో పంచ్ కొడితే పతకం సాధించాలనే తపనతో ప్రతిభకు ప దును పెడుతోంది. ఇటీవల జ రిగిన జాతీయస్థాయి పోటీల్లో ప్ర తిభ చూపి మే నెలలో మలేషియాలో దేశంలో జరిగే ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు ఎంపికై ంది మెట్టు హాసిని.
పోటీ పడుతే పతకమే..
మంథనికి చెందిన మెట్టు దేవి – నర్సింగం దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కుతూరు మానసకు వివాహం అయ్యింది. చిన్నకుతూరు హాసిని మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు మంథని బాలికల హైస్కూల్‌లో చదివింది. ముత్తా రం మండలం ధర్య పూర్ మోడల్ స్కూల్‌లో ఇంటటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రా సింది. నాలుగో తరగతిలోనే సీనియర్ల ను చూసి కరాటే నే ర్చుకోవడమే కాదు.. అందులో రాణించాలని కంకణం కట్టుకుంది. ఇలా ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతూనే కరాటేలో శిక్షణ తీసుకుంది. అదేసమయంలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించింది. పోటీపడితే వెండి పతకాలతోపాటు ఇప్పటివరకు 15 బంగారు పతకాలు సాధించింది. 2024లో హరియాణాలోని పంచకుల, మధ్యప్రదేశ్‌లోని గాలియానాలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో బ్లాక్‌బెల్ట్‌లో గోల్డ్‌మెడల్ సాధించి ఔరా అనిపించింది. గతేడాది 2024 నవంబరులో కరీంనగర్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో బ్లాక్‌బెల్ట్‌లో ఫస్ట్‌డాన్‌గా గోల్డ్ మెడల్ కై వసం చేసుకుంది. ఈఏడాది మే 7 నుంచి 12వతేదీ వరకు మలేషియాలో జరిగే అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభ చూపే అవకాశం దక్కించుకుంది.
అమ్మ ప్రోత్సాహం.. మాస్టర్ కృషి
మా నాన్న మా కుటుంబానికి దూరంగా ఉంటున్నా.. మా అమ్మ కూలీ పనిచేస్తూ అక్క పెళ్లి చేసి, నన్ను చదివిస్తోంది. ఆడపిల్లకు కరాటే పోటీలు అవసరమా అని బంధువులు, ఇరుగుపొరుగువారు సూటిపోటీ మాటలతో ప్రశ్నించేవారు. ఇది మనోవేదనకు దారితీసినా.. కరాటే మాస్టర్ సమ్మయ్య నచ్చజెప్పి మళ్లీ శిక్షణ ఇచ్చారు. ఆడవాళ్లు అంటే కుటుంబానికే పరిమితం కాదనే పట్టుదలతో కరాటేలో రాణిస్తున్నా. మలేషియాలో జరిగే పోటీల్లో మెడల్ సాధించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నా. నా ప్రతిభ నాలాంటి ఆడపిల్లల కుటుంబాలకు ఆదర్శంగా నిలవాలి.

పంచ్ కొడితే పతకమే