
పాలకా.. ఏమనాలా?
ఇంత గలీజా?
● నగరంలో అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ ● శిథిలావస్థలో కాల్వలు.. రోడ్డుపై పారుతున్న మురుగు నీరు
కరీంనగర్‌కార్పొరేషన్:
శరవేగంగా విస్తరిస్తోన్న నగరం. పుట్టుకొస్తున్న కాలనీలు. విలీన గ్రామాలతో పరిధి పెంచుకుంటూ పోతున్న నగరపాలకసంస్థ. కానీ.. ఏళ్లుగా డ్రైనేజీ వ్యవస్థ మాత్రం మెరుగుపడడం లేదు. అధ్వానంగా మారిన డ్రైనేజీ వ్యవస్థతో నగర ప్రజలు ఇక్కట్లు పడుతున్నా, బల్దియా అధికారుల్లో చలనం కనిపించడం లేదు. నగరంలో ప్రధానంగా మూడు నాలా లున్నాయి. మొదటి నాలా పోలీసు శిక్షణా కేంద్రం (పీటీసీ) నుంచి ప్రారంభమై రాంనగర్, జ్యోతినగర్, ముకరంపుర, కలెక్టరేట్, అంబేడ్కర్ స్టేడియం, గణేశ్‌నగర్, లక్ష్మినగర్ మీదుగా బైపాస్ దాటి ఎల్ల మ్మ గుడి సమీపంలో వాగులో కలుస్తోంది. రెండోది కోర్టు ప్రాంతంలో ప్రారంభమై ప్రభుత్వ ఆసుపత్రి, శర్మనగర్, సాయిబాబా ఆలయం, రైతుబజార్, బొమ్మవెంకన్న భవనం, గోపాల్‌చెరువు మీదుగా పోతుంది. మూడో నాలా రాంపూర్‌లో ప్రారంభమై అలకాపురికాలనీ, సిరిసిల్ల బైపాస్, డీమార్ట్, ఎన్‌టీఆర్ విగ్రహం మీదుగా వాగులో కలుస్తుంది. పీటీసీ నుంచి జ్యోతినగర్‌కు వరకు నాలా 6 ఫీట్ల నుంచి 8 ఫీట్ల వెడల్పుతో ఉండగా, ముకరంపురకు వచ్చే సరికి 2 ఫీట్ల నుంచి 4 ఫీట్లకు కుచించుకుపోయింది. టూటౌన్ పోలీసు స్టేషన్ సమీపంలో విమానం వీధి మునగడానికి ఇదో కారణం.
డ్రైనేజీలతో ఇక్కట్లు...
నగరంలో 758 కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా, 624 కిలోమీటర్ల డ్రైనేజీలు ఉన్నాయి. రోడ్ల వెంట పూర్తిస్థాయిలో డ్రైనేజీల నిర్మాణం జరగలేదు. కొన్నిచోట్ల శిథిలావస్థకు చేరుకోవడం, నిర్వహణ సరిగా లేకపోవడంతో మురుగు నిలుస్తోంది. తిరుమల్‌నగర్, కోతిరాంపూర్, కిసాన్‌నగర్, విద్యానగర్, మంకమ్మతోట, హుస్సేనిపుర, దుర్గమ్మ గడ్డలో డ్రైనేజీలు సక్రమంగా లేక మురుగు ముందుకు కదలడం లేదు. ఖాళీ స్థలాల్లోకి మురుగునీళ్లు చేరి వేసవిలోనూ కుంటలను తలపిస్తున్నాయి.
కట్టరాంపూర్, తిరుమల్‌నగర్ సరిహద్దులోని ఈ డ్రైనేజీ శిథిలావస్థకు చేరుకుంది. ఒక వైపు గోడ పగిలిపోగా, మరో వైపు గోడ లేదు. దీంతో మురుగునీరు డ్రైనేజీలోనే నిలిచిపోతోంది. అస్తవ్యస్త డ్రైనేజీ, సిల్ట్ సమస్యగా మారింది.
ముకరంపురలోని టూటౌన్ పోలీసుస్టేషన్ పక్కన నాలా దుస్థితి ఇది. నిర్వహణ లోపంతో సిల్ట్ భారీగా పేరుకుపోతోంది. కల్వర్టు అవతలి వైపు నాలా కుచించుకుపోవడంతో మురుగునీరు ముందుకు కదలదు. ఫలితంగా విమానం వీధి వాసులు దశాబ్దాలుగా ఇక్కట్లు పడుతున్నారు.
నగరంలోని డివిజన 60 (పాతవి)
నగర జనాభా 3.50 లక్షలు
నాలాలు 03
డ్రైనేజీలు 624 కిలోమీటర్లు
రోడ్లు 758 కిలోమీటర్లు
ఎవరూ పట్టించుకోవడం లేదు
సివిల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న నాలా నిర్వహణను ఎవరూ పట్టించుకోవడం లేదు. నాలా గోడలు కూలిపోయాయి. కొన్ని చోట్ల ఆక్రమణలు జరిగాయి. వర్షాకాలం వచ్చిందంటే మురుగునీళ్లు శర్మనగర్, సాహెత్‌నగర్‌లను ముంచెత్తుతాయి. సంవత్సరాల నుంచి నాలా నిర్మాణం చేయాలంటే పట్టించుకోవడం లేదు.
– నయీమొద్దీన్, సాహెత్‌నగర్
ఏళ్లుగా ఇబ్బంది
ముకరంపురలో పెద్ద మోరీ నిర్మాణం, నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాం. గోడలు పూర్తిగా కూలిపోవడం, సిల్ట్ తీయకపోవడంతో మురుగునీరు నిలిచి దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక వర్షాకాలం వచ్చిందంటే మురుగునీళ్లు రివర్స్‌లో మా ఇళ్లలోకి వస్తాయి. తడిసి సామగ్రిని ఆరడానికి కనీసం నాలుగు రోజులు పడుతోంది.
– డాక్టర్ బింగి శ్రీనివాస్, ముకరంపుర

పాలకా.. ఏమనాలా?

పాలకా.. ఏమనాలా?

పాలకా.. ఏమనాలా?

పాలకా.. ఏమనాలా?