
పల్లెలపై కాలుష్య మేఘాలు
మొలంగూర్ శివారులో సీడ్‌ప్లాంట్ నుంచి వస్తున్న పొగ
పచ్చని పల్లెలపై కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. గ్రామీణ ప్రజలు ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగతో ఇబ్బంది పడుతున్నారు. శంకరపట్నం మండలం మొలంగూర్ శివారులో పదుల సంఖ్యలో సీడ్ ప్లాంట్లు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే పొగతో సమీప గ్రామాలైన మొలంగూర్, కేశవపట్నం, గొల్లపల్లి గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల సీడ్‌ప్లాంట్ నుంచి వచ్చిన పొగతో చెట్టు మాడిపోయిందని, పంటపొలాలు దెబ్బతింటున్నాయని ప్రజలు అంటున్నారు. కాలుష్యనియంత్రణ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
– శంకరపట్నం(మానకొండూర్)