
వీరివీరి గుమ్మడి పండు..
వీరివీరి గుమ్మడి పండు.. వీరిపేరేమి.. దాగుడుమూతలు దండాకోల్! చికుబుకు రైలు వస్తోంది.. పక్కకు పక్కకు జరగండి కోతికొమ్మచ్చి.. పట్టుకోండి చూద్దాం పులిమేక.. ఎవరు గెలుస్తరో ఏమో అష్టాచెమ్మా..గడులు దాటాలి.. నేనే గెలవాలి వైకుంఠపాళి.. నిచ్చెన ఎక్కితే సరి.. పాము మింగితే బలి గోటీలాట.. సూటి చూసి కొట్టాలి.. గోటీలు గెలవాలి చిర్రగోనె.. అందుకుంటే ఔట్.. లేదంటే గుడ్‌షాట్ వంగుడు.. దుంకుడు.. ఒక్కొక్కరు ఎగిరి దూకాలి.. తాకితే అంతే మరి ఆడుదామా కచ్చకాయ.. ఎగిరేస్తా చూడు రాయి.. పట్టుకుంటా మళ్లీ..
కొనుగోళ్ల వెంటే రవాణా
.. అంటూ చేతిలో సెల్‌ఫోన్ లేని కాలంలో చిన్నారులు ఎక్కువగా ఆడిన ఆటలు ఇవీ.. పొద్దున లేస్తే గల్లీ పోరగాళ్లు అందరూ ఒక్కచోట చేరి పొద్దుపోయే దాక ఆడి.. అలిసిపోయి ఇల్లు చేరేవారు. అలనాడు ఆడిన ఆటలతో వ్యాయామంతో పాటు.. విజ్ఞానం పెరిగేది. శరీరం ఉల్లాసంగా ఉండేది.. ఆరోగ్యానికి బాసటగా నిలిచేది. కాలం మారుతోంది.. శారీరక వ్యాయామం తగ్గిపోతోంది. చిన్నారులు సెల్‌ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. కాళ్లు, చేతులు కదపకుండా.. కళ్లతోనే ఆడుతున్నారు. బద్ధ్దకంతో ఆన్‌లైన్ ఆటలకు బందీలుగా మారి.. బరువు పెరిగిపోతున్నారు. పట్టణాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుండగా.. పల్లెల్లో అక్కడక్కడా.. అలనాటి ఆటలు ఆడుతూ.. ‘సాక్షి’ కెమెరాలకు చిన్నారులు కనిపించారు. ఈ సందర్భంగా అలనాటి ఆటలు.. వాటితో లాభాల గురించి కథనం..
– సాక్షి ఫొటోగ్రాఫర్స్,
పెద్దపల్లి/రాజన్న సిరిసిల్ల
– వివరాలు... IIలోu
కరీంనగర్ అర్బన్: కొనుగోలు కేంద్రాల్లో సమస్యల్లేకుండా చర్యలు చేపట్టామని, కొనుగోళ్ల వెంటే రైస్‌మిల్లులకు ధాన్యం రవాణా చేస్తున్నామని పౌరసరఫరాల సంస్థ డీఎం మంగాళరపు రజనీ కాంత్ స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని వెల్లడించారు. నిబంధనల ప్రకారం ధాన్యాన్ని సేకరిస్తామని, అన్నదాతలు నాణ్యతా ప్రమాణాలు పాటించి ధాన్యం తీసుకురావాలని సూచించారు. జిల్లాలో మొత్తం 347 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 32వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామ ని, టార్పాలిన్లు, సౌకర్యాలకు కొరత లేదని వివరించారు. కేంద్రాల్లో సౌకర్యాలు, మద్దతు ధర కల్పన, దళారుల దోపిడీకి అడ్డుకట్ట వంటి అంశాలపై శనివారం ‘సాక్షి’ ఇటర్వ్యూలో వివరించారు.
జిల్లా అంతటా కొనుగోళ్లు
ఈ సీజన్లో వరి కోతలు కొంత ఆలస్యమయ్యా యి. 5.86 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వ స్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో వ్యక్తిగత, ఇతర అవసరాలు పోనూ ఎంత వస్తుందన్నది త్వరలోనే తేలనుంది. జిల్లావ్యాప్తంగా దొడ్డు రకం ధాన్యం, సన్న రకం ధాన్యం కొనుగోళ్లకు వేర్వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లావ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు 32వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం.
పక్కా కార్యాచరణతో కొనుగోళ్లు
కొనుగోలు కేంద్రంలో తాగునీరు, టెంట్, కూలీల కోసం షెడ్లు, వోఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించాం. కోటి గన్నీ సంచులు అవసరమవుతాయి. అవసరానికి తగినట్టుగా గన్నీ సంచులను అందుబాటులో ఉంచాం. రోజూ లక్ష నుంచి రెండు లక్షల వరకు సంచుల్లో ధాన్యం నింపుతున్నారు. టార్పాలిన్లు, ధాన్యం రవాణాకు లారీలు అందుబాటులో ఉన్నాయి. కేంద్రాల నుంచి తీసుకెళ్లిన ధాన్యాన్ని 24 గంటల్లో దించాలని మిల్లర్లకు సూచించాం.
ఇబ్బందులు తలెత్తితే
రైతులకు ఇబ్బందులు తలెత్తినా, ఏవైనా ఫిర్యాదులున్నా కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నంబర్ 9154249727 సంప్రదించాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారు.
నిబంధనల ప్రకారమే తూకం
ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగానే ధాన్యం తూకం వేయాలని నిర్వాహకులకు, మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశాం. తాలు లేకుండా శుభ్రమైన ధాన్యం తీసుకువచ్చి రైతులు సహకరించాలి. తేమ 17 శాతం మించరాదు. గన్ని సంచిలో 40.580 కిలోలు తూకం వేయాలి. తరుగు పేరుతో అదనంగా తూకం వేయరాదు. ఆటోమేటిక్ ధాన్యం శుభ్రం చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.
ఎప్పటికప్పుడు నగదు జమ
ధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం నిర్దేశిత సమయంలో నగదు జమయ్యేలా చర్యలు చేపడుతున్నాం. ట్యాబ్ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా కేంద్రాల్లో సిబ్బందిని నియమించాలని సూచించాం. వానాకాలం సీజన్లో 72 గంటల్లో ఖాతాల్లో నగదు జమ చేశారు. ప్రస్తుతం అదే ప్రక్రియ కొనసాగనుంది. ధాన్యం తీసుకోవడానికి 96 మిల్లులు సంసిద్ధతను తెలియజేశాయి. చాలామట్టుకు మిల్లులు బ్యాంక్ గ్యారంటీ అందజేశాయి. ఇంకా బ్యాంక్ గ్యారంటీ అందజేస్తున్న వారికి ధాన్యం కేటాయిస్తున్నాం.
జిల్లాలో మొత్తం సాగువిస్తీర్ణం 2,90,000
సాగైన వరి: 2,66,896ఎకరాలు
రానున్న దిగుబడి:
5,86,723మెట్రిక్ టన్నులు
ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం: 32,541మెట్రిక్ టన్నులు
కొనుగోలు కేంద్రాలు: 347
రైస్‌మిల్లులు: 96
ధాన్యం మద్దతు ధర:
ఏ గ్రేడ్: రూ.2,320
సాధారణ రకం: రూ.2,300