బనశంకరి: ఉపాధ్యాయునికి ముంబై పోలీసుల ముసుగులో ఫోన్ చేసిన సైబర్ కేటుగాళ్లు రూ.32.25 లక్షలు దోచుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. చతురరావ్ (50) అనే ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈశాన్య సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఎలా జరిగిందంటే
వివరాలు... శనివారం కొరియర్ కంపెనీ ప్రతినిధి పేరుతో ఫోన్ చేసిన సైబర్ నేరగాడు.. మీకు కొరియర్ పార్శిల్ వచ్చింది, అందులో మీ మొబైల్ నంబర్, ఆధార్, ఐదు పాస్‌పోర్టులు, ఐదు క్రెడిట్‌కార్డులు, ల్యాప్‌టాప్ ఉన్నాయి, ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. మీరు వీడియోకాల్ ద్వారా మాట్లాడాలి, దీనికోసం ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఒక లింక్ పంపించాడు.
యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత అదే వ్యక్తి మళ్లీ ఫోన్ చేసి, మరో వ్యక్తి ఎవరో మీపేరుతో రికార్డులు దుర్వినియోగానికి పాల్పడ్డాడు, వారి ఆచూకీ కనిపెట్టాలంటే మా అకౌంట్ కు నగదు జమచేయాలని చెప్పాడు.
నిజమేననుకున్న చతుర్‌రావ్, వంచకులు తెలిపిన రెండు బ్యాంక్ అకౌంట్లకు దశలవారీగా రూ.32.25 లక్షలను పంపించాడు. తరువాత ఆయన ఫోన్ చేయగా మోసగాని నంబర్ స్విచాఫ్ వచ్చింది. ఇది వంచన అని తెలసుకున్న బాధితుడు సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని వంచకుల కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment