
అర్జీలను పరిశీలిస్తున్న న్యాయమూర్తి
● ఇద్దరు యువకుల దుర్మరణం
కోలారు: ద్విచక్ర వాహనాన్ని టెంపో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఆదివారం బంగారుపేట తాలూకా బెంగనూరు గ్రామం వద్ద చోటు చేసుకుంది. బంగారుపేట పట్టణం సిద్దార్థ నగర్‌కు చెందిన ముత్తు (26), మండ్య జిల్లాకు చెందిన రవి (30) మృతులు. వీరిద్దరు బంగారుపేట పట్టణంలోని బెంగనూరు గ్రామం వద్ద ఉన్న గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. పని ముగించుకుని బైక్‌పై తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. బంగారుపేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
లోక్ అదాలత్‌లో 21,972 కేసుల పరిష్కారం
కోలారు: జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 21,973 కేసులు రాజీ చేసుకోవడం ద్వారా పరిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సెషన్స్ న్యాయమూర్తి జిఎ మంజునాథ్ మాట్లాడుతూ... జాతీయ లోక్ అదాలత్ అత్యధిక కేసులను పరిష్కరించడం సంతోషంగా ఉందని, ఇందులో 79 క్రిమినల్ కేసులు, 301 చెక్ బౌన్స్ కేసులు, 16 కుటుంబ వ్యాజ్యాలు, ఇతర సివిల్ కేసులు 379 పరిష్కరించారు. లోక్‌అదాలత్‌కు సహకారం అందించిన న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం మునేగౌడ, కార్యదర్శి భైరారెడ్డి, పదాధికారులకు జిల్లా న్యాయ సేవా ప్రాధికార సభ్యుడు సునీల్ ఎస్ మొసమని కృతజ్ఞతలు తెలిపారు.
ఆస్తి వివాదం, సోదరులపై దాడి
హుబ్లీ: ఆస్తి వివాదానికి సంబంధించి సోదరులపై దాడి చేసిన ఘటన స్థానిక ఏపీఎంసీ నవనగర్ పరిధిలో చోటుచేసుకుంది. గోకుల్ రోడ్డు కేహెచ్‌బీ కాలనీ మహమ్మద్ సిద్దికి, మహమ్మద్ అలీలపై వారి సొంత అన్న మైనుద్దీన్ దాడి చేశారు. ఏపీఎంసీ యార్డులోని అంగడిని కబ్జా చేసే ఉద్దేశంతో కావాలనే దాడి చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment