కార్మిక వ్యతిరేక బడ్జెట్ తగదు
రాయచూరు రూరల్ : కేంద్ర సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అసంఘటిత కార్మిక వ్యతిరేక బడ్జెట్ అని ఏఐటీయూసీ ఖండించింది. శుక్రవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మహేష్ మాట్లాడారు. ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్, రైల్వే, బ్యాంకింగ్ రంగాలను ప్రైవేటీకరిస్తూ తీసుకున్న నిర్ణయాలను, ఏపీఎంసీ, విద్యుత్, కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహించే వారిని పర్మినెంట్ చేయాలన్నారు. కార్మికులకు కనీసం రూ.31 వేల వేతనం చెల్లించాలన్నారు. అంగన్‌వాడీ, బిసిఊట కార్యకర్తలకు గౌరవధనం పెంచాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలను కల్పించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment