బళ్లారిఅర్బన్: ఎస్సీ అలెమారి చెన్నదాసర వలయ, మాలదాసులకు 3 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డీ.రంగయ్య న్యాయమూర్తి నాగమోహన్‌దాస్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన జిల్లాధికారి వినతిపత్రం అందజేసి మీడియాతో మాట్లాడారు. న్యాయమూర్తి హెచ్‌ఎన్ నాగమోహన్ దాస్ నివేదిక ప్రకారం ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అమలు కోసం సుప్రీంకోర్టు ఏడుగురు ప్రధాన న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వివేచన మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించిందన్నారు. విద్య, రాజకీయ, ఆర్థిక, సామాజిక అత్యంత వెనుకబడిన చెన్నదాసుల సమాజానికి అంతర్గత రిజర్వేషన్లలో మూడు శాతం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల శాతం వల్ల ఆ సమాజానికి తగినంత మేలు జరగడం లేదన్నారు. ఈ వర్గాల సర్వతోముఖాభివృద్ధికి మూడు శాతం రిజర్వేషన్ కేటాయించాలని ఆయన న్యాయమూర్తిని కోరారు. ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మహాదేవప్ప, ప్రముఖులు మంజునాథ్, ఎర్రిస్వామి, రామయ్య రంగన్న, రామన్న, లక్ష్మణ, సోమశేఖర్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment