హుబ్లీ: పంచపీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రానికి వచ్చే అశేష భక్తులకు కనీస వసతులు కల్పించే దిశలో 400 వసతి గదులతో సముదాయ భవన నిర్మాణ పనులను చేపట్టినట్లు శ్రీశైల జగద్గురువులు డాక్టర్ చెన్నసిద్దరామ పండితారాధ్య శివాచార్య స్వామీజీ తెలిపారు. ఉనకల్ సిద్దప్పజ్జ నూతన శిలామంటప నిర్మాణ పనులను శనివారం పరిశీలించి ఆలయ కమిటీ గౌరవ సన్మానం స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ప్రభుత్వం 10 ఎకరాల భూమి ఇచ్చింది. 5 ఎకరాలను స్వాధీనం చేసుకొని అందులో భక్తుల కోసం వసతి గదులతో ఆధునిక ఆస్పత్రి నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. భక్తులు తెచ్చే ఇనుప కడ్డీలతో మంటపం నిర్మాణం చేపట్టామన్నారు. నిర్మాణ కార్యానికి భక్తులు ఉదారంగా విరాళాలు ఇవ్వాలని కోరారు. ఉణకల్ సిద్దప్పజ్జ తమ బతుకును పోరాటాల మధ్య భక్తుల మనసు గెలిచిన ధీశాలి అన్నారు. దేవమానవులుగా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే సిద్దపురుషులని కొనియాడారు. దేవస్థాన కమిటీ నూతన శిలా మంటప నిర్మాణ పనులు చేపట్టిందని, దీనికి భక్త బృందం కోట్ల రూపాయల విరాళం ఇవ్వడం సిద్దప్పజ్జ మహిమకు నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు రాజన్న కొరవి, శివాజీ, రామన్న, సిద్దనగౌడ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment